ఫోకస్

కుటుంబ వ్యవస్థలా పరిపాలన సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ కుటుంబ వ్యవస్థకు ఎంతటి ప్రాధాన్యత, గౌరవం ఉన్నదో ప్రజాస్వామ్యయుత ఈ దేశంలో అలాంటి గౌరవాన్ని పరిపాలనకు తోడైనప్పుడే అన్ని వర్గాలకు శుభం చేకూరుతుంది. ప్రధానంగా పాలకులు అలాగే ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రసీ మధ్య సమన్వయం ఎంతో అవసరం. మనదేశంలో ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ప్రతి ఒక్కరు స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. అయితే అన్ని స్థాయిల్లోను దానికి హద్దు అనేది అవసరం. కుటుంబ వ్యవస్థలో తల్లి, తండ్రి ఎవరి పాత్ర ఎవరు ఎలా పోషిస్తున్నారో పరిపాలనలో కూడా అటు పాలకులు, ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు అలాంటి పాత్ర పోషించినప్పుడే ఎలాంటి వివాదాలకు తావు ఉండదు. అయితే అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ఎవరు గీత దాటినప్పటికీ చివరకు నష్టపోయేది సామాన్య ప్రజలు మాత్రమే. ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో చట్టాలు రూపొందించాలని దానిని పాలకులు అధికారుల ద్వారా అమలు చేయించాల్సి ఉంది. అయితే ఇందులో ఏ ఒక్కరూ కూడా తమతమ పరిధిలు దాటతానికి వీరులేదు. ఒక వేళ ప్రజాప్రతినిధులు, మంత్రులు తెలిసో తెలియకో తమ పరిధి దాటితే నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ప్రతి ప్రభుత్వశాఖలోను ఒక ఉన్నతాధికారి ఆ ఉన్నతాధికారులందరికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. ఇలాంటప్పుడు ఏ ఒక్కరూ కూడా నేరుగా ఎదుటి వారిపై చట్టాన్ని తమ చేతిలో తీసుకుని చట్టానికి విరుద్ధంగా ఎదుటి వారిపై చర్య తీసుకోవటం సరైందికాదు. అసలు ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా పరిపాలనలో నేరుగా జోక్యం చేసుకోవటం సరైన విధానం కాదు. గ్రామస్థాయిలో సర్పంచ్, మండల స్థాయిలో మండలాధ్యక్షుడు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపాల్టీలో మున్సిపల్ చైర్మన్ ఎటూ ఉన్ననే ఉన్నారు. ఇక వార్డు నెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు నేరుగా అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవటం మంచిపద్ధతి కాదు.

- ప్రత్తిపాటి పుల్లారావు ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి