ఫోకస్

‘అహం’తోనే సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఎవరైనా సంయమనం పాటించాలి. తాము కేవలం ప్రజాప్రతినిధులమన్న భావనతో ఉంటే అసలు సమస్యలే రావు. ఎవరికైనా ‘అహం’ ఉండరాదు. అది ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి. ఎంత ప్రశాంతంగా ఉన్నా, కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఏవైనా సున్నితమైన సమస్యలు ఎదురవుతాయి. అటువంటప్పుడు పంతాలు, పట్టింపులకు పోకుండా ముఖ్యమంత్రి వద్ద లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద పరిష్కరించుకోవాలి. కానీ మీడియా ద్వారా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటే చులకన అవుతామని ఇరువైపులా భావించాలి. ప్రజాసేవలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు రావడం సహజం. ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధికి అత్యున్నతమైన గౌరవం (ప్రొటోకాల్) ఇవ్వాల్సిన బాధ్యత అందరి అధికారులపై ఉంది. ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ఉంటారు ఆ తర్వాత ‘మాజీ’ అవుతారన్న భావన ఎవరికీ ఉండరాదు. ప్రభుత్వంలో అధికారిగా ఉన్నవారూ తాము ప్రజా సేవకులమేనన్న భావనతో ఉండాలి. వారూ ఎప్పటికైనా పదవీ విరమణ చేసి ‘మాజీ’ కావాల్సిందే కదా. కాబట్టి ఇరువైపులా సత్సంబంధాలు ఉంటేనే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా ప్రజలకు నష్టం జరుగుతుంది. అభివృద్ధి, సంక్షేమ పనులు సజావుగా జరగవు. ప్రజాప్రతినిధులు విధాన నిర్ణయాలు, చట్టాలు చేస్తే వాటిని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కాబట్టి ఎవరైనా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలి. ఇటీవల కొన్ని బాధాకరమైన సంఘటనలు జరిగాయి. ఏదో సందర్భంలో ప్రజా ప్రతినిధులకు అక్కడి అధికారులపై ఆగ్రహం, చిరాకు కలిగితే సంయమనం పాటించి, వాటిగురించి ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వారు దానికి పరిష్కారం చూపుతారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా తమపట్ల దురుసుగా ప్రవర్తించినట్లు అధికారులు భావించినా, బహిరంగంగా విమర్శలు చేయకుండా వాటి గురించి ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు తీసుకెళితే ఆ స్థాయిలో సింపుల్‌గా పరిష్కారమవుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రతినిధులైనా, అధికారులైనా ప్రజలకు సేవ చేసేందుకు తమకు కలిగిన మహాభాగ్యంగా భావించి సంయమనంతో మెలగాలి.

డాక్టర్ జె. గీతారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్