ఫోకస్

సర్దుకుపోతే సరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరుగాంచిన మన దేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులైనా ప్రజలకోసం వారు పనిచేసేందుకు ప్రత్యేకమైన చట్టాలున్నాయి. కొన్ని సార్లు కొందరు ప్రజాప్రతినిధులు చట్టాలను ఉల్లంఘించి ప్రజలకు ప్రయోజనాలను పక్కన బెట్టి, తమకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చే పనులు చేయాలంటూ అధికారులను ఆదేశిస్తారు. తమ వ్యక్తిగత అభిప్రాయాలనే సర్కారు ఆదేశాలు, ప్రజావసరాలుగా సృష్టించి వాటిని అమలు చేయాలంటూ అధికారులను ఆదేశిస్తారు. ఇలాంటి సమయంలోనే వారి మధ్య భేధాభిప్రాయాలు తలెత్తి దూరం పెరుగుతోంది. దీని ప్రభావం ప్రజలకు మనం అందించాల్సిన సేవలు, సాధించాల్సిన అభివృద్ధిపై పడుతోంది. ఎవరు పనిచేసినా ప్రజల కోసమేనన్న విషయాన్ని గుర్తించి, భేదాభిప్రాయాలు వచ్చినపుడు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధిలో సమానంగా భాగస్వాములవుతారు. అవసరమైతే ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎగువన ఉన్న ప్రభుత్వ వ్యవస్థను ఇద్దరు సంప్రదిస్తే వారి మధ్య పూర్తిస్థాయిలో ఏకాభిప్రాయం కుదరకపోయినా, కనీసం బేధాభిప్రాయాలు కొంతవరకు సమసిపోయే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో చట్టాలను అనుసరించి ఎవరికి వారు ప్రజల అవసరాలు, వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. ఈ రకమైన భాగస్వామ్యంకోసం ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించుకునేందుకు చేసే ప్రయత్నాలవల్ల కూడా వీరిద్దరి మధ్యనున్న సంబంధాలు దెబ్బతింటాయి. అందుకే కొన్ని జిల్లాల్లో కలెక్టర్‌గా నేను పనిచేసిన సమయంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఏర్పాటు చేసే శిలాఫలకంపై నా పేరు రాయకుండా సర్క్యులర్ జారీ చేసేవాడిని.

డా. బి.జనార్దన్ రెడ్డి, ఐఏఎస్ కమిషనర్, జిహెచ్‌ఎంసి