ఫోకస్

సమన్వయం ఎలా సాధ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి పుట్టుకతోనే సంఘజీవి. విజ్ఞులు అభిమానం కొద్దీ వినయంగా వ్యవహరిస్తారు. దుర్బుద్ధి ఉన్నవారూ వినయంగా నటిస్తారు. సమాజంలో మంచివాడిగా మారిన మనిషి అన్ని ప్రాణుల కంటే గొప్పవాడు. తనచుట్టూ ఉన్న సంఘంలో తనకో గౌరవం ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. తన ఉనికి గుర్తించబడాలని తహతహలాడతాడు. అంతవరకూ తనను తాను గౌరవించుకుంటాడు. దానినే ఆత్మగౌరవం అంటాం. ఒక్కోసారి కనీస అవసరాలకు మించి ఆత్మగౌరవం అత్యవసరం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రాణం కంటే ఎక్కువ అనిపిస్తుంది. ఆ ఆత్మగౌరవానికి భంగం కలిగేంతవరకూ అతను సమాజం నుండి ఏమీ ఆశించడు. ఎప్పుడైతే తన ఆత్మగౌరవానికి అవమానం జరిగిందో అపుడే సమాజానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాడు. విమానాశ్రయంలో నాటి ముఖ్యమంత్రి అంజయ్యకు జరిగిన అవమానాన్ని ఒక కాంగ్రెస్ నాయకుడికి జరిగిన అవమానంగా అంతా భావించినా ఎన్టీఆర్ మాత్రం అలా భావించలేదు. ఒక నిజాయితీ ఉన్న నాయకుడికి , సమర్థత ఉన్న నేతకు ఇంత అవమానం జరిగిందా అని ఆలోచించారు. ఈ ఆలోచన నుండే ఆత్మగౌరవ పోరాటం జరిగింది. అందుకే అరిస్టాటిల్ మాటల్లో చెప్పాలంటే ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేకపోయినపుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలని చెప్పారు. అలాగే మనిషి మంచితనం ఎక్కడ అంతం అవుతుందో అక్కడే రాజకీయం మొదలవుతుందని చెప్పారు. ఈ చర్చ అంతా ఇటీవల రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు, సీనియర్ అధికారులకు మధ్య జరుగుతున్న వివాదాలకు సంబంధించిందే. ఆ మధ్య ఒక ఎమ్మార్వోపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి ఘటన కావచ్చు, బస్సుల రద్దుకు సంబంధించి ఆర్టీవో అధికారిపై టిడిపి నేతల దాడి కావచ్చు, వైద్యులపై వైకాపా నేతల దాడి కావచ్చు, ఇటీవల కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయకు ప్రోటోకాల్ ఉల్లంఘన అంశం కావచ్చు, తాజాగా కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే బి శంకరనాయక్ దుష్ప్రవర్తన కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు క్షమాపణలు చెప్పగా, మరికొన్ని సందర్భాల్లో అధికారులు కూడా క్షమాపణలు చెబుతున్నారు. కాని ఇలా ఎందుకు జరుగుతోంది... ఈ సంఘటనలకు ముగింపు లేదా అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. అధికారులూ ప్రజా సేవకులే, ప్రజాప్రతినిధులు సైతం ప్రజాసేవకులే. వీరంతా పనిచేసేది ప్రజా సంక్షేమం కోసమే. అలాంటి వారి మధ్య సత్సంబంధాలు చాలా అవసరం. శాంతి, సంతోషం, ప్రేమ, పవిత్రతతో మనం ఏం చేసినా అందరికీ మంచిగానే కనిపిస్తుంది, లేకుంటే సంబంధాలు దెబ్బతింటాయి. ఈ అంశంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.