అంతర్జాతీయం

యుద్ధ సన్నాహాల్లో చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: సిక్కిం సెక్టార్‌లో భారత సైన్యంతో ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో యుద్ధానికి దిగేందుకు చైనా సైన్యం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సిక్కిం సెక్టార్‌కు దక్షిణ ప్రాంతంలోని కున్యున్ పర్వత ప్రాంతానికి చైనా వేల టన్నుల యుద్ధ సామాగ్రిని తరలించినట్లు తెలుస్తోంది. చైనా లోతట్టు ప్రాంతాల్లో ఇదివరకే నిర్మించుకున్న రోడ్లు, రైల్వే వ్యవస్థద్వారా లక్షలాది సైనికులు, వేల టన్నుల ఆయుధ సామాగ్రిని చేరవేసి యుద్ధానికి సిద్ధమవుతోందని అంటున్నారు. చైనా సైన్యం భారీ ఆయుధాలను కున్యున్ పర్వత శ్రేణుల్లో మోహరించటం పూర్తి చేసినట్లు వార్తలందుతున్నాయి. చైనా సైన్యం గుట్టుచప్పుడు కాకుండా సిక్కిం సెక్టార్‌కు అతి సమీపంలోని పర్వతాల వెనక ప్రాంతానికి సైన్యాన్ని తరలించటంతోపాటు పాలకుల నుంచి ఆదేశాలు అందిన మరుక్షణం యుద్ధం చేసేందుకు సన్నద్ధమవుతోందని చెబుతున్నారు. సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌తోపాటు దేశం మొత్తం సరిహద్దుల్లో సైనిక మోహరింపు జరుగుతోందని అంటున్నారు. కేవలం సిక్కిం సెక్టార్‌లో మాత్రమే దాడి చేయకుండా సరిహద్దు పొడవునా భారత సైన్యంపై దాడి చేయటంతోపాటు మెరుపు దాడులతో భారత భూభాగం ముఖ్యంగా సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోకి చొచ్చుకుపోయేలా సైనిక మోహరింపు జరుగుతోందని అంచనా వేస్తున్నారు. చైనా చాలాకాలం నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ తదితర ప్రాంతాలపై కనే్నసి పెట్టటం తెలిసిందే. ఈసారి యుద్ధం జరిగే పక్షంలో తవాంగ్ తదితర ప్రాంతాలను స్వాధీనం చేసుకునేలా సైనిక మోహరింపు జరుగుతోందని అంటున్నారు. ఈ లక్ష్య సాధన కోసమే చైనా ఉత్తర టిటెబ్ పర్వత ప్రాంతంలో సైనిక, ఆయుధ మోహరింపు జరుపుతోందని అంటున్నారు. భారతదేశం సరిహద్దుల్లో రెండు లక్షల మంది సైనికులను మోహరిస్తే, చైనా దాదాపు ఆరు లక్షల మందిని మోహరించినట్లు తెలుస్తోంది. యుద్ధం జరిగితే భారతదేశానికి పెద్దఎత్తున నష్టం కలిగించేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక హెచ్చరించటం తెలిసిందే. చైనా సైన్యం గతవారం టిబెట్ పీఠభూమిలో పెద్దఎత్తున సైనిక కవాతు, యుద్ధ శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. భారత దేశంతో యుద్ధం జరిగితే పెద్ద ఎత్తున ఆయుధాలు, చైనా సైనికులు వేల టన్నులకొద్దీ ఆయుధాలను అత్యంత సునాయసంగా ఉత్తర టిబెట్ ప్రాంతానికి తరలించగలుగుతున్నారని షాంగాయ్ అధ్యయన సంస్థలో దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు వాంగ్ దెహు చెబుతున్నాడు. అత్యాధునిక రవాణా సౌకర్యాలుంటే యుద్ధంలో అతి సులభంగా విజయం సాధించేందుకు వీలు కలుగుతుందన్నది అతని అభిప్రాయం. ఇదిలావుంటే భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు మాత్రం సిక్కిం సెక్టార్‌లో రెండు దేశాల సైనికుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యమార్గాల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. చైనా సైనిక మోహరింపును పత్రికలు పెద్దవిచేసి చూపుతున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. చైనాతో ఎప్పటికప్పుడు దౌత్యస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైనికుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని వారంటున్నారు.
ఇదిలాఉంటే చైనా, భారత దేశాల విదేశీ వ్యవహారాల శాఖల అధికారులు సిక్కిం సెక్టార్ ఉద్రిక్తతల గురించి అభివృద్ధి చెందిన దేశాల రాయబారులకు వివరించటం ప్రారంభించారు. చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు ఇటీవల బీజింగ్‌లో ఐక్యరాజ్య సమితిలోని భద్రతా వ్యవహారాల కమిటీ శాశ్వత సభ్యులైన ఐదు అభివృద్ధి చెందిన దేశాల రాయబారులకు సిక్కిం సెక్టార్ పరిస్థితిని వివరించటంతోపాటు భారత దేశం తమ సైనికులను బేషరతుగా ఉపసంహరించుకోకపోతే యుద్ధం తప్పదని స్పష్టం చేసినట్లు వార్తలు రావటం తెలిసిందే. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల మంత్రి బిషప్‌కు సిక్కిం సెక్టార్ ఉద్రిక్తతల గురించి వివరించారు.