రాష్ట్రీయం

ఇరుక్కున్న పూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: కాదు ఔను అంటూనే అడ్డంగా దొరికిపోయాడు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. అసలు డ్రగ్స్ అంటేనే తెలీదంటూ సమాధానాలు మొదలెట్టిన పూరి, చివరికి సూత్రధారి కెల్విన్ ఈవెంట్ మేనేజర్‌గా మాత్రమే తెలుసన్న సమాధానాల వరకూ వచ్చారు. టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంపై సిట్ అధికారుల విచారణ బుధవారం ప్రారంభమైంది. డ్రగ్స్ విషయంలో సిట్ నుంచి నోటీసులు అందుకున్న స్టార్ డైరెక్టర్ పూరి, బుధవారం ఉదయం రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ముందు హాజరయ్యారు. కెల్విన్‌తో పూరీ పరిచయాలు ఎలాంటివి? సినీ పరిశ్రమకు అందుతోన్న డ్రగ్స్ వ్యవహారంలో పూరీ పాత్ర ఏమిటి? అన్న కోణంలోనే ప్రధానంగా విచారణ సాగింది. దాదాపు పది గంటలపాటు సాగిన విచారణలో తొలుత డ్రగ్స్ ముఠాతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న పూరి, సిట్ అధికారులు ఆధారాలు చూపెట్టడంతో అంగీకరించక తప్పని పరిస్థితి తలెత్తింది. డ్రగ్స్ వ్యవహారంలో అనేక ప్రశ్నలు సంధించిన అధికారులు కీలక సమాచారం రాబట్టడంతో, స్టార్ దర్శకుడి మెడకు ఉచ్చు బిగిసినట్టేనన్న అంచనాలు వినవస్తున్నాయి. హీరోయిన్ చార్మి ప్రధాన పాత్రలో తాను దర్శకత్వం వహించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో డ్రగ్ డీలర్లు కెల్విన్, జీషన్‌తోపాటు తాను కూడా పాల్గొన్నట్టు దర్శకుడు పూరీ జగన్నాథ్ అంగీకరించారు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పర్యవేక్షణలో కార్యాలయంలోని ఐదో అంతస్తులో డిఎస్పీస్థాయి అధికారితోపాటు ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు పూరీని కూలంకషంగా విచారించారు. వీడియో చిత్రీకరణ ద్వారా విచారణ కొనసాగింది. ఇందుకుగానూ ఓ వీడియో గ్రాఫర్‌ను విచారణాధికారులు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన విచారణలో మధ్యాహ్నం వరకు పూరీనుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిసింది. భోజన విరామం తరువాత పూరి, సిట్ అధికారులు చూపిన ఆధారాలతో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెల్లడించినట్టు సమాచారం. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను సిట్ అధికారులు పూర్తిగా కార్నర్ చేశారు. అయితే అధికారుల ప్రశ్నలకు పూరి ఆచితూచి సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు డ్రగ్స్ అలవాటు లేకపోయినా కెల్విన్, జీషన్‌తో పరిచయం ఉన్నట్టు అధికారుల ఎదుట ఒప్పుకున్నట్టు తెలిసింది. కెల్విన్, జీషన్ ఈవెంట్స్ ద్వారా పరిచయం అయ్యారని, తరువాత ఒకటి, రెండుసార్లు ఓ పబ్‌లో కలిశానని, అయితే తనకు వారితో ఎలాంటి రెగ్యులర్ సంభాషణలు జరగలేదని దర్శకుడు పూరి అధికారులకు వెల్లడించినట్టు సమాచారం. అయితే ఓ ఆడియో ఫంక్షన్‌లో కలిసిన కెల్విన్ బ్యాంక్ అకౌంట్‌కు పూరి డబ్బులు పంపించినట్టు అధికారులు పేర్కొనడంతో, పూరి నోరు మెదపలేదని తెలిసింది. కాగా దర్శకుడు పూరి సిట్ అధికారుల సుదీర్ఘ విచారణలో చెప్పిన సమాధానాలే ఈ కేసులో కీలకం కాబట్టి, పూరిని కెల్విన్‌తో దోస్తీ, ఆర్థిక లావాదేవీలపై మరోసారి విచారించనున్నట్టు తెలిసింది. పూరి మత్తు పదార్థాలు వాడుతున్నారా? లేదా? అనే విషయంపై సిట్ రక్త పరీక్షలు నిర్వహించేందుకు ఉస్మానియా ఆసుపత్రికి చెందిన వైద్యుడిని రప్పించి రక్త నమూనాలు సేకరించినట్టు తెలిసింది. అదేవిధంగా నార్కొటిక్ అధికారులు కూడా పూరి విచారణకు హాజరయ్యారు. విచారణ మరికొంత కాలం కొనసాగనున్నట్టు విశ్వసనీయ సమాచారం.