రాష్ట్రీయం

తప్పు చేయలేదు.. చేయను కూడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: డ్రగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు కెల్విన్ ముఠాతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం సిట్ అధికారులు చేసిన విచారణకు తాను పూర్తిగా సహకరించానని, మళ్లీ పిలిచినా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. దాదాపు పదకొండు గంటల పాటు సిట్ అధికారుల విచారణను ఎదుర్కొన్న పూరి ఆ తరువాత మూడు నిమిషాల నిడివిగల వీడియో క్లిప్‌ను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాను ఎన్నడూ తప్పు చేయలేదని, తప్పుడు పనులు చేసే అలవాటు తనకు లేనే లేదని ఆయన అన్నారు. ‘నాపై వచ్చిన ఆరోపణలపై సిట్ నన్ను ప్రశ్నించింది. అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇచ్చాను. నేను బాధ్యత గల వ్యక్తిని. చట్టవ్యతిరేకమైన, తప్పుడు పనులు చేసే అలవాటు నాకు లేదు.’ అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. పోలీస్ శాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే ఆ శాఖకు సంబంధించి ఎన్నో సినిమాలు చేశానని ఆయన వివరించారు. మీడియాలో తనకు ఎంతోమంది మిత్రులున్నారని, వారంటే తనకు ఎంతో అభిమానమని కూడా పూరీ అన్నారు. జర్నలిజం అంటే ఇష్టం కాబట్టే తాను ‘ఇజం’ అనే సినిమా తీసినట్లు ఆయన వివరించారు. నాలుగైదు రోజులుగా మీడియా ప్రసారం చేసిన కథనాలు తనను, తన కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏదైనా ఉంటే సిట్ నిర్ణయిస్తుంది. కానీ మీడియా నన్ను నా కుటుంబాన్ని చాలా డిస్ట్రబ్ చేసింది. ఒక రకంగా జీవితాన్ని నాశనం చేశారు.. నాలుగు రోజుల నుంచి అమ్మ, భార్య పిల్లలు ఏడుస్తున్నారు. ననే్న కాదు.. చాలా కుటుంబాల్లో పరిస్థితి ఇలాగే ఇబ్బంది పెట్టారు.’ అని పూరి పేర్కొన్నారు.