రాష్ట్రీయం

వేగంగా రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 19: విజయదశమికి నిర్మాణ పనులు ప్రారంభించి 2019 మార్చి 31నాటికి రాజధానిలో పాలనా నగరాన్ని సిద్ధం చేయాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కార్య ప్రణాళికను సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ సిఎం ముందుంచారు. ఆగస్టు 15కి అసెంబ్లీ, 30నాటికి హైకోర్టు భవంతుల తుది ఆకృతులను ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ అందిస్తుందని తెలిపారు. దీన్ని అనుసరించి పరిపాలన నగర నిర్మాణ పనుల కార్య ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. బుధవారం సచివాలయంలో రాజధాని నిర్మాణ పురోగతిపై సిఆర్‌డిఏ, ఏడిసి అధికారులతో సిఎం సమీక్షించారు. 25 జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలు అమరావతికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయని, వాటిలో 14 సంస్థలు గతవారం జరిగిన వర్క్‌షాపుకు హాజరయ్యాయని సిఎంకు వివరించారు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో కూడిన విద్యను అందించే సంస్థలకు అవసరమైన భూమి అవసరమైతే ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమని ఈ సందర్భంగా బాబు వివరించారు. ధీరూభాయ్ అంబానీ ట్రస్టు విద్యా సంస్థను అమరావతిలో నెలకొల్పేందుకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతిలో స్టార్ హోటళ్లు ఏర్పాటుకు 16 సంస్థలు ఆసక్తి చూపాయని సిఎంకు వివరిస్తూ, గతవారం ఏడు, బుధవారం మరో 9 సంస్థలు తమ ఆసక్తి వ్యక్తపర్చాయన్నారు. విజయవాడ నగర నదీ అభిముఖ ప్రాంతం, మూడు కాల్వలకు ఇరువైపులా అభివృద్ధిని అధికారులు సిఎంకు వివరించారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి కనకదుర్గ గుడికి వెళ్ళే మార్గాలను ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేయాలని, దాన్ని ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సిఎం సూచించారు. ఈ జోన్‌లో బయటి వాహనాలు రాకుండా, ప్రత్యేక రవాణా వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. జల రవాణానూ దీనిలో అంతర్భాగం చేయాలన్నారు. జోన్ పరిధిలో వాటర్ ఫ్రంట్‌లు, బస్ స్టేషన్‌లో ఫుడ్ ప్లాజా ఏర్పాటు చేసి, కృష్ణవేణి ఘాట్ నుంచి పవిత్ర సంగమం వరకు ప్రత్యేక ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, క్రాఫ్ట్ ఫుడ్ మార్కెట్లు, రాజీవ్‌గాంధీ పార్క్ తదితర అభివృద్ధి ప్రణాళికలను అధికారులు సిఎంకు వివరించారు.
110 పట్టణాలు వాల్‌పోస్టర్ రహితం
110 పట్టణాలను పోస్టర్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సిఎం సూచించారు. అన్ని మున్సిపాల్టీల్లో రహదారులకు ఇరువైపులా గోడలను వివిధ కళాకృతులతో అలంకరించే కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని పట్టణాల్లో రంగులు వేసే కార్యక్రమం సాగుతోందని మున్సిపల్ శాఖ డైరెక్టర్ కన్నబాబు వివరించారు. మేజర్ మున్సిపాల్టీల్లో ఈ పని పూరె్తైందని, పోస్టర్లు అంటించే వారినుంచి పెనాల్టీ వసూలు చేస్తున్నట్టు చెప్పారు.
110 నగరాల్లో వచ్చే ఆదివారం నుంచి ‘హ్యాపీ సండే’ అమలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ప్రజలు తమకు నచ్చిన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాలని ఈ సందర్భంగా సిఎం సూచించారు. రాష్ట్రంలో 90 వేలకు పైగావున్న పందులను నంద్యాల తరహాలో పునరావాస కేంద్రాలకు తరలించి, పెంపకందారులకు 50శాతం సబ్సిడీ ఇచ్చి ఆదాయ మార్గాలు చూపే ఏర్పాట్లు చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్ళుగా మార్చుతున్నామని, ఇది మంచి ఫలితాలను చూపుతోందని అధికారులు వివరించారు. రూ.3 కోట్లతో 90వేల ప్రింటెడ్ పుస్తకాలను మహిళా శిశు సంక్షేమ శాఖతో కలిసి అందించామన్నారు. మున్సిపల్ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ పెరగడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ స్కూళ్లలో ‘నో అడ్మిషన్’ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఉందని అధికారులు చెప్పగా, ఐఐటి ఫౌండేషన్ కోర్సులు పెట్టాక అనూహ్య మార్పులు వచ్చాయని మంత్రి నారాయణ సిఎంకు వివరించారు. ఇంగ్లీష్ మీడియం బలవంతంగా రుద్దవద్దని, కోరుకున్న వారికే ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని సిఎం సూచించారు.
చిత్రం.. రాజధాని నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తున్న సిఎం చంద్రబాబు