సంపాదకీయం

పచ్చదనంపై పగ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్-ఏఎమ్‌ఆర్‌సి-వారు విజయవాడ శివారులో అరవై ఎకరాల భూమిని సేకరించకుండా హైదరాబాద్ హైకోర్టు తాత్కాలికంగా నిరోధించడం వర్తమాన ఘట్టం! తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలకు సేకరిస్తున్న భూమి కూడ న్యాయ వివాదాలకు గురి అవుతుండడం నడచిపోతున్న ప్రహసనం! 2013 నాటి భూమి సేకరణ చట్టం లోని నిబంధనలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రమే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్నది ‘న్యాయ యాచికల’ను దాఖలు చేస్తున్న వారి ఆరోపణ! భూమిని కోల్పోతున్న వారికి, భూమిపై ఆధారపడిన వ్యవసాయ శ్రామికులకు పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించడం భూమిని సేకరిస్తున్న ప్రభుత్వాల విధి. ఈ విధిని నిర్వర్తించకపోవడం వల్లనే వివిధ ఉన్నత న్యాయస్థానాలలో, ‘జాతీయ హరిత మండలి’లో భూమి సేకరణకు వ్యతిరేకంగా న్యా య యాచికలు దాఖలు అవుతున్నాయి! భూములను విపరీతంగా సేకరిస్తున్నందువల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతిని పోతుండడం నడిచిపోతున్న ప్రహసనంలో ప్రధాన వైపరీత్యం. పర్యావరణ పరిరక్షణ విషయమై పాటించవలసిన ‘హరిత నిబంధనల’ ఉల్లంఘన జరగని రీతిలో భూ మిని వ్యవసాయేతర పథకాల కోసం సేకరించాలన్నది చట్టంలోని స్ఫూర్తి. సేకరణ వల్ల సంభవించే సామాజిక ప్రభావం -సో షియల్ ఇంపా క్ట్-తో, ప ర్యావరణ ప్రభావాన్ని -ఎన్విరాన్‌మెంటల్ ఇం పాక్ట్- కూడ అం చనా వేసిన త రువాతనే వ్యవసాయ, అటవీ భూములను సేకరించాలన్నది ‘చట్టం’ లో ని ఇతివృత్తం. సామాజిక ప్రభావాన్ని అంచనా వేయని ‘సేకరణ’లపై లెక్కకు మిక్కుటంగా న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి, న్యాయ యాచికలు దాఖలు అవుతున్నాయి.
ఇలా దాఖలు కావడం ప్రభుత్వాల సేకరణ ప్రక్రియలోని లోపాలకు నిదర్శనం. కానీ కేవలం ‘పర్యావరణ ప్రభావం’ ప్రాతిపదికగా దాఖలవుతున్న ‘న్యాయ యాచికలు’ చాలా తక్కువ! హరిత పర్యావరణంలో వృక్షజాలం-్ఫ్లరా, జంతుజాలం-్ఫనా-్భగం. ‘సేకరణ’వల్ల ఉపాధిని, నివాసాన్ని కోల్పోతున్న వారు న్యాయస్థానాలను ఆశ్రయించగలరు! నోరులేని వృక్షజాలం, నోరు ఉన్నా మానవ భాష మాట్లాడలేని జంతుజాలం ఇలా ఆశ్రయించలేవు! అందువల్ల పర్యవరణ పరిరక్షణ ధ్యాసగల ఉద్యమకారులు మాత్రమే ఈ ‘జీవజాలం’ తరఫున న్యాయం కోరుతున్నారు. కానీ హరిత నియమాలను అతిగా పాటించరాదన్నది ‘డెవలప్‌మెంట్’-అభివృద్ధి-పేరుతో అటవీ విధ్వంసం చేస్తున్న, వ్యవసాయ హననం చేస్తున్న విధాన కర్తల నిర్ధారణ! ఈ విధానానికి ఆధునిక రూపకర్త మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్. హరిత నియమాలను అతిగా పాటించడం వల్ల ‘ప్రగతి’ స్తంభించిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆధ్వర్యవం వహించిన పదేళ్ల కాలంలో డాక్టర్ సింగ్ పదే పదే వాక్రుచ్చి ఉన్నాడు! పచ్చదనానికి గొడ్డలిపెట్టుగా మారిన ‘ప్రపంచీకరణ’ను వ్యవస్థీకరించిన వాడు మన్‌మోహన్ సింగ్! వేలకొలదీ ఎకరాలలో, వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒకేచోట పరిశ్రమలు, సిమెంటు కట్టడాలు, వాణిజ్య కాలుష్య వాటికలు కేంద్రీకృతం అవుతుండడం ‘ప్రపంచీకరణ’. వికేంద్రీకృత ప్రగతి తరతరాల భారతీయ పద్ధతి! ‘వికేంద్రీకరణ’వల్ల పర్యావరణం పాడుకాదు, పచ్చదనం అంతరించదు, వన్యమృగ హననం జరగదు. మన రాజ్యాంగంలోని నలబయి ఎనిమిదవ అధికరణం స్పూర్తి ఇదే. వన్యమృగాలను, అడవులను పరిరక్షించి పర్యావరణ హరిత శోభను పెంపొందించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని 48-ఏ-వ అధికరణం నిర్దేశిస్తోంది. ప్రతిరోజూ నూట నలబయి ఎనిమిది హెక్టారుల-మూడు వందల డెబ్బయి ఐదు ఎకరాల-అడవులు తగ్గిపోతున్నాయి. ఏదీ రాజ్యంగ స్ఫూర్తి?
ఈ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న ‘ప్రపంచీకరణ’ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. పరిశ్రమల స్థాపన కోసం విదేశీయ, స్వదేశీయ సంస్థలకు యుద్ధ ప్రాతిపదికపై అనుమతులను ఇచ్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి, లేకుంటే పెట్టుబడులు రావట! పెట్టుబడుల మోహంతో పచ్చదనానికి ద్రోహం జరుగుతోంది! సంస్కరణం పేరుతో ‘సేద్యం’ సన్నగిల్లుతోంది! సేంద్రియ వ్యవసాయం, ఆయుర్వేద వైద్యం పెంపొందాలని ఆధికారక ఉద్ఘోషణలు జరుగుతూనే ఉ న్నాయి! రసాయనపుఎఱువుల ది గుమతి పెరుగుతూనే ఉంది! ఆయుర్వేద ఔ షధ ఉత్పత్తికి పనికివచ్చే మొక్కలు -ఓషధులు -క్ర మంగా అంతరించిపోతున్నాయి! ప్రపంచంలో మం దుల తయారీకి పనికి వచ్చే మొ క్కలు ఇరవై వేల జాతులుగా ఏ ర్పడి ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిందట! వీటి ఐదువేల జాతుల ‘మందుమొక్కలు’-ఓషధులు- మన దేశంలో పెరుగుతున్నాయట! విచ్చలవిడిగా అటవీ విధ్వంసం వల్ల ఇతర వృక్షాలతోపాటు ఓషధీ లతలు, తరు నికుంజాలు నశించిపోతున్నాయట! బెంగాల్ దక్షిణ ప్రాం తంలో పెరుగుతున్న ఐదు వందల ఎనబయి ఒక్క జాతుల ఓషధుల వివరాలతో కూడిన ‘పర్యావరణ పత్రాన్ని’ బెంగాల్ రాష్ట్ర అటవీ మంత్రిత్వశాఖ ఇటీవల రూపొందించిందట! వీటిలో అధిక శాతం అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉన్నదన్నది ఆందోళన కలిగించవలసిన అంశం!
తెలంగాణ ప్రభుత్వం అమలు జరుతున్న ‘హరిత హారం’, అవశేషాంధ్ర ప్రదేశ్‌లో కొనసాగుతున్న ‘వనం-మనం’ వంటి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకాలు కావచ్చు! కానీ పచ్చదనాన్ని హరించే పరిశ్రమల కోసం భూమి సేకరణ కూడ సమాంతరంగా ఊపందుకుంటోంది! పర్యావరణం పరిరక్షణకూ, పరిశ్రమల స్థాపనకూ మధ్య సంతులనం, సయోధ్య నెలకొనే విధంగా వికేంద్రీకృత పద్ధతిలో ‘ప్రగతి’ని సాధించలేమా? ప్రభుత్వాలు అనేక ప్రగతి లక్ష్యాలను ప్రకటిస్తున్నాయి. దేశంలోని కనీసం మూడవ వంతు భూమిపై అడవులు పెరగాలన్న లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుంది??