మెయన్ ఫీచర్

టిబెట్‌పై ‘పిడుగు’పాటు.. ‘డోక్‌లా’లో చొరబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిబెట్‌లో మనం చేసి ఉండవలసిన సైనిక విన్యాసాలను చైనా చే స్తోంది. ‘సిక్కిం-్భటాన్’ ప్రాంతాలలో విస్తరించి ఉన్న ‘డోక్‌లా’-డోక్‌లామ్-పచ్చిక మైదానంలోకి చొరబడి తిష్ఠవేసి ఉన్న చైనా సైనికులను మన సైనికులు టిబెట్‌లోకి నెట్టివేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇంకా విజయవంతం కాలేదు! ఈలోగా మనలను ‘బెదిరించడానికై’ చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున టిబెట్‌లో సైనిక విన్యాసాలను ప్రారంభించిందట! మనం అమెరికా, జపాన్ నౌకాదళాలతో కలిసి ఉమ్మడిగా చేస్తున్న ‘సముద్ర సమర’ విన్యాసాలకు పోటీగా చైనా ‘టిబెట్ విన్యాసాలను’ ఆరంభించిందన్నది స్పష్టం! ‘సిక్కిం-్భటాన్’ ప్రాంతంలోకి చొరబడిన చైనా ముష్కర మూకలు చొరబాటును చాలించి తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా లేరని ప్రచారవౌతోంది! క్రీస్తు శకం 2014లో లడక్‌లోని ‘దీప్‌సంగ్’, ‘చుమార్’ తదితర ప్రాంతాలలోకి చొరబడిన చైనా సైనికులను మెడలు పట్టుకుని మన భద్రతా దళాలవారు ‘వాస్తవ అధీనరేఖ’-ఎల్‌ఏసి-లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్’-కు ఆవలివైపునకు నెట్టేశారు. ఈ ‘నెట్టివేత’లు ఆరంభమైన తరువాత లడక్‌లో చైనా చొరబాట్లు తగ్గిపోయాయి. అందువల్ల ‘డోక్‌లామ్’ గురించి కూడ చైనా సైనికులను మన వారు మెడలు పట్టుకుని నెట్టుకుంటూ వెళ్లి టిబెట్‌లో పడవేయగలరన్న భయం చైనాకు పట్టుకుంది. ఇలా నెట్టివేసినట్టయితే పెద్ద యుద్ధం తప్పదన్న భ్రాంతిని కల్పించడానికై చైనా టిబెట్‌లో ఈ ‘సమర విన్యాసాల’ను ప్రారంభించింది! ఆఫ్రికా ఖండంలోని ‘జిబౌటీ’ దేశంలో ఇటీవల చైనా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడం ఈ ‘బెదిరింపు దౌత్యం’లో, ‘వ్యూహాత్మక విస్తరణ’లో భాగం! టిబెట్ దాదాపుగా రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం వరకు మన దేశంలో భాగం, ఆ తరువాత క్రీస్తు శకం 1950వ దశకం వరకు స్వతంత్ర దేశం! మనకు తమకూ మధ్య ఉండిన స్వతంత్ర దేశమైన టిబెట్‌ను చైనా వారు ఆక్రమించుకొనడం మనకూ చైనాకూ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణలకు చారిత్రక నేపథ్యం!
భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విస్తరణ వాదం ఫలితంగా సరిహద్దులు మారవచ్చు.. ఉన్న సరిహద్దులు చెరిగిపోవచ్చు, లేని సరిహద్దులు పుట్టుకుని రావచ్చు. ఒకే జాతీయ సార్వభౌమ భూమి ముక్కలు చెక్కలయిపోయి కొత్త కొత్త సార్వభౌమ దేశాలు ఏర్పడవచ్చు. ఒక స్వతంత్ర దేశాన్ని, స్వతంత్ర దేశాలను మరో స్వతంత్ర దేశం దిగమింగవచ్చు! ధరాతల చరిత్రగతి ఇందుకు సాక్ష్యం! కానీ ఈ ‘మార్పులు’ శాశ్వతం కాదన్నది చరిత్ర ధ్రువీకరించిన వాస్తవం! ఒకనాటి భౌగోళిక, రాజ్యాంగ, ఆర్థిక సాంస్కృతిక స్థితి నేడు మారిపోయి ఉండవచ్చు! అంతమాత్రాన ఆ గతంలోని నిర్దిష్టకాల ఖండంలో నెలకొని ఉండిన ఆయా వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవు! వేద విజ్ఞానం ప్రాతిపదికగా వికసించిన సంస్కృతి ప్రపంచమంతటా విస్తరించి ఉండడం ‘కృతయుగం’ నాటి వాస్తవం. ఇది భారతీయుల ‘్భవోద్వేగ భరితమైన అతిశయోక్తి కాదని’, ‘సతార్కికంగా హేతుబద్ధంగా ధ్రువపడిన చారిత్రక పరిణామ క్రమమని’ మన దేశానికి చెందిన, విదేశాలకు చెందిన నిష్పక్ష చరిత్రకారులు నిరూపించి ఉన్నారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం- అన్న చారిత్రక కాల ఖండాలలో భరత ఖండం మాత్రమే కాదు, భూగోళం మొత్తం అనేకానేక ‘పరివర్తన’లకు గురి అయింది. ప్రస్తుతం కలియుగంలో 5119వ సంవత్సరం నడుస్తోంది! కృత త్రేతా ద్వాపర యుగాల చరిత్ర వర్తమాన స్మృతులకు అందకపోవచ్చు. కానీ, కలియుగం మొదలైన నాటినుంచి ఈ ఐదు వేల వంద పద్దెనిమిది ఏళ్ల-పూర్తయిన సంవత్సరాలు-చరిత్ర మాత్రం జాతీయ జీవన స్మృతి పథంలో స్పష్టంగా కనిపిస్తునే ఉంది. కలియుగారంభం నాటికి టిబెట్ మన దేశంలో ఒక ప్రాంతంగా ఉండడం ఈ చారిత్రక సత్యాలలో ఒకటి. కలియుగం ఇరవై ఆరవ శతాబ్ది నుంచి అంటే క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్ది నుంచి టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండడం కూడ వాస్తవం! ఈ రెండు వాస్తవాలు కూడ మన వర్తమానపు సరిహద్దుల భద్రతతో ముడివడి ఉన్నాయి! టిబెట్ మళ్లీ మన దేశంలో కలిసిపోవచ్చు, కలసిపోకపోవచ్చు! కనీసం టిబెట్ మళ్లీ స్వతంత్ర దేశంగా అవతరించినట్టయితే చైనాతో ‘సరిహద్దు’ బెడద మనకు ఉండదు.. ఈ దీర్ఘకాల లక్ష్య సాధనకు ఇప్పుడైనా వ్యూహాత్మక శ్రీకారం జరగాలి!
టిబెట్ మళ్లీ స్వాతంత్య్రం పొందడం సాధ్యమేనా? అన్నది చారిత్రక మీమాంసకు సంబంధించిన ప్రశ్న! ప్రథమ స్వాతంత్య్ర సమరం క్రీస్తుశకం 1857లో ఆరంభమై విఫలమైన తరువాత మన దేశం శాశ్వతంగా బ్రిటన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండిపోగలదన్న భ్రాంతి కలగలేదా? కానీ ఈభ్రాంతి ‘దశాబ్ది’ కాలం గడవక ముందే పటాపంచలైంది. స్వాతంత్య్ర సమర జ్వాలలు మళ్లీ రాజుకున్నాయి, బ్రిటన్ వ్యతిరేక సాయుధ సమరం ఆరంభమైంది. 1885లో పుట్టిన కాంగ్రెస్ ఉద్యమ సంస్థ తొలి సంవత్సరాలలో భారత స్వాతంత్య్రాన్ని కోరలేదు, బ్రిటన్ సామ్రాజ్యంలో భాగంగా బ్రిటన్ వారితో సమాన హక్కులు గల పౌరులుగా భారతీయులు జీవించాలన్నదే నాటి ‘కాంగ్రెస్’ లక్ష్యం! కానీ లోక్‌మాన్య బాల గంగాధర తిలక్, లాలా లజపతిరాయ్, విపిన చంద్రపాల్ వంటి వారి నాయకత్వం సిద్ధించిన తరువాత ‘కాంగ్రెస్’ బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమ సంస్థగా రూపొందలేదా? వృద్ధుడయిన తరువాత ప్రస్తుత దలైలామా టిబెట్‌కు స్వాతంత్య్రం అక్కరలేదని చైనాలో ‘స్వయం ప్రతిపత్తి’-అటానమీ-గల ప్రాంతంగా టిబెట్ కొనసాగడం తమ అభీష్టమని అంటున్నాడు! 2005 వరకు టిబెట్ స్వాతంత్య్రాన్ని కోరిన దలైలామా ఆ తరువాత చైనాకు ‘లొంగిపోవడం’ దేశ విదేశాలలోని ‘త్రివిష్టప’ ప్రజలకు మింగుడుపడని విపరిణామం! అయినప్పటికీ దలైలామా ప్రకటనలతో సంబంధం లేకుండా లక్షలాది టిబెట్ ప్రజల హృదయాలలో స్వాతంత్య్ర సమర జ్వాల రగులుతూనే ఉంది!
2008లో ‘బీజింగ్’లో జరిగిన ‘ఒలింపిక్స్’ ఆటల పోటీల సందర్భంగా మన దేశంలోను, అనేక ఇతర దేశాలలోను ‘టిబెట్’ ప్రజలు చైనాకు పెద్దఎత్తున నిరసనలు తెలపడపం ఈ స్వాతంత్య్ర మహదాకాంక్షకు చెరగని సాక్ష్యం! మన ‘్ధర్మశాల’ కేంద్రంగా 1959 నుంచి నడుస్తున్న స్వతంత్ర టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని ఇప్పుడైనా ఆధికారికంగా గుర్తించడం మన ప్రభుత్వానికి కర్తవ్యం! అమెరికా, ఐరోపా, తూర్పు ఆసియా దేశాలను కూడగట్టుకుని సమష్టిగా ‘స్వతంత్ర టిబెట్’ను గుర్తించడానికి మన ప్రభుత్వం యత్నించడం చైనా ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ కాగలదు. ఇలా బ్రిటన్ అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు క్రీస్తుశకం 1940వ దశకంలో పూనుకొనడం వల్లనే 1948లో ఇజ్రాయిల్ ఏర్పడింది, రెండు వేలకు పైగా దేశం లేని ‘యూదు ప్రజల’కు మళ్లీ సర్వ స్వతంత్ర సార్వభౌమ దేశం లభించింది! ‘రోమన్ల’ దాడికి బలైపోయిన యూదులు-హిబ్రూ భాష మాట్లాడే ఇజ్రాయిలీ ప్రజలు- మధ్యధరా సముద్రపు తూర్పు తీరంలోని తమ మాతృభూమిని కోల్పోయారు, చెల్లాచెదురై ప్రపంచంలోని నలుమూలలకు పారిపోయారు. మనదేశంలో తప్ప మరే దేశంలోను యూదులకు మానవీయ ఆతిథ్యం లభించకపోవడం వేరే కథ. కానీ స్వాతంత్య్రాన్ని మళ్లీ సాధించడం కోసం యూదులు రెండు వేల సంవత్సరాలకుపైగా ఓపికతో వేచి ఉన్నారు. ‘వచ్చే సంవత్సరం మన మాతృ భూమిలో కలుసుకుందాము..’ అన్న విశ్వాసాన్ని ప్రపంచ వ్యాప్త యూదులు ప్రతి పండుగ సందర్భంలోను ఈ రెండు వేల ఏళ్లపాటు ఆవిష్కరించారు. ప్రవాస టిబెట్టీయులు కూడ 1959 నుంచి ఇలా ‘స్వాతంత్య్రం’ కోసం వేచి ఉన్నారు. స్వతంత్ర టిబెట్ మన ఉత్తర సరిహద్దులకు రక్షణ కవచం..
స్వతంత్ర దేశంగా ఉండిన సమయంలో టిబెట్ నిరంతరం చైనా దురాక్రమణను ఎదిరించి నిలిచింది! ఈ యుద్ధాల ఫలితంగా వివిధ సమయాల్లో టిబెట్‌కు చెందిన దాదాపు లక్షన్నర చదరపు మైళ్ల భూభాగాన్ని చైనా దురాక్రమించి తనలో కలుపుకుంది. అయినప్పటికీ నాలుగు లక్షల అరవై ఐదు వేల చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన టిబెట్ 1959 వరకు స్వతంత్ర దేశంగా కొనసాగింది! క్రీస్తుశకం పనె్నండవ శతాబ్ది చివరిలోను, పదమూడవ శతాబ్ది ఆరంభంలోను, ‘బక్తియార్ ఖిల్జీ’ అనే జిహాదీ బీభత్సకారుడు మనదేశంలో భయంకర విధ్వంస కాండను సృష్టించాడు! ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నలంద మహా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసి ఆ మహా విద్యాలయ ప్రాంగణంలోని లక్షల గ్రంథాలను తగులబెట్టిన బక్తియార్ ఖిల్జీ మానవ రూపంలోని మతోన్మాద పిశాచం. ఈ నర రాక్షసుడు క్రీస్తుశకం 1205లో టిబెట్టును జయించడానికి బయలుదేరాడు. దాదాపు ఇరవై వేల గుఱ్ఱపు దళాన్ని సమకూర్చుకుని ఈ ఉగ్రవాది ఆర్భాటంగా అస్సాంలోకి, అరుణాచల్‌లోకి, టిబెట్‌లోకి చొరబడినాడు! టిబెట్‌లో ప్రవేశించిన ‘జిహాదీ’ దళాలు వనవాసీ ప్రజల ఆవాసాలను ధ్వంసం చేయడానికి పూనుకున్నాయి. కానీ వనవాసీ ప్రజలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తమ ఆవాసాలను ఖాళీ చేసినట్టు అభినయించారు. బక్తియార్ ఖిల్జీ గుఱ్ఱపుదండు బాగా ముందుకు దూసుకుని పోయింది, బ్రహ్మపుత్ర నది సమీపం వరకు వెళ్లింది. ఆ సమయంలో వనవాసీ వీరులు నలువైపుల నుంచి చుట్టుముట్టి ఖిల్జీ సైన్యాలను నామరూపాలు లేకుండా నశింప చేసారు. భయంకర బీభత్స కారుడైన బక్తియార్ ఖిల్జీ భయ విభ్రాంతికి లోనై వెనుతిరిగి పారి వచ్చాడు. అరుణాచల్ సరిహద్దులలో మానసిక రోగ గ్రస్తుడై మంచాన పడినాడు! అలీ మర్దాన్ అనే సహచర బీభత్సకారుడు ఒక గుడిసెలో పడుకుని ఉండిన బక్తియార్ ఖిల్జీని పరామర్శించడానికి వెళ్లాడు! లేవలేని ఖిల్జీ ముఖం మీదకి దుప్పటి లాగి అలీ మర్దాన్ ఖిల్జీ గుండెలలోకి ‘గునపాన్ని’ దింపేశాడు. నలంద మహా విద్యాలయ ప్రాంగణంలో ఒకరోజున ఎనిమిది వేల మంది బౌద్ధ మతాచార్యులను హత్య చేయించిన ‘ఖిల్జీ’ అన్న బీభత్సకారుడిని టిబెట్ ప్రజలు అలా శిక్షించడం చరిత్ర! ఇరవై వేల రాక్షస మూకలను టిబెట్ గిరిజనులు ధ్వంసం చేయగలిగారు. ఆ తరువాత మనదేశాన్ని దురాక్రమించిన ‘జిహాదీ’ ముష్కరులెవ్వరూ టిబెట్ వైపున కనె్నత్తి చూడలేదు, క్రీస్తుశకం 1903లో మాత్రమే బ్రిటన్ ముష్కరులు కనె్నత్తి చూసారు.. యంగ్ హస్బండ్ అనే బ్రిటన్ సాహసికుడు కొంత సైన్యంతో టిబెట్‌లో చొరబడి రాజధాని ‘లాసా’కు చేరాడు!
ఈ ‘ఘటన’ తరువాత బ్రిటన్, చైనాలు రెండూ టిబెట్ స్వాంత్య్రాన్ని గుర్తించాయి! చైనా నుంచి రక్షించడానికై టిబెట్‌లో మన దేశంలోని బ్రిటన్ ప్రభుత్వం సైనిక దళాలను నెలకొల్పింది! చైనా మైత్రి మత్తెక్కిన మన ప్రభుత్వం 1950 దశకంలో మన సైనికులను ఉపసంహరించి, టిబెట్‌ను చైనా పాలుచేసింది! ‘డోక్‌లా’ మైదానంలోకి చైనా చొరబడడానికి ఇలా టిబెట్ చైనా దురాక్రమణకు గురి అయి ఉండడం కారణం..

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్ : 99510 38352