Others

నైపుణ్యం వృద్ధికే పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులకు నిర్వహించే వార్షిక పరీక్షల ఫలితాలు ప్రకటించగానే లక్ష్యాలు పూర్తయినట్లు కాదు. పరీక్షల లక్ష్యం దీర్ఘకాలికమైనది. ప్రతి పరీక్షకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఒకే మాదిరిగా, ఒకే రీతిగా ఉండాలంటే కుదరదు. ప్రతి ఏడాదీ అది ఒకే రకంగా ఉండదు. విద్యారంగంలో జరిగిన పరిశోధన, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు, విద్యార్థి ఆశయాలు వీటన్నింటికి అనుగుణంగా ఆ ఏడాది పరీక్షల లక్ష్యాలను నిర్దేశించుకుంటారు.
21వ శతాబ్దంలో మార్పులపైన కొత్త నైపుణ్యాలు తెరమీదకు వచ్చాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, సృజనాత్మక ఆలోచనలు, సమస్యలను పరిష్కరించటం, ఇతరులతో సమన్వయం.. ఇవన్నీ 21వ శతాబ్దపు మానవ సంపదకు కావాల్సిన నైపుణ్యాలు. వీటిని దృష్టిలో పెట్టుకుని వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రశ్నల స్వభావం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. పరీక్షా పత్రాలు రూపొందించేటప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పరీక్షాధికారులు నిర్దేశిస్తారు. వీటిపై ఆ సంవత్సరమే కాకుండా కొన్ని సంవత్సరాల వరకు పిల్లలకు తర్ఫీదు ఇస్తారు. పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఈ మా ర్పును నిరోధిస్తే పిల్లలకే నష్టం. పరీక్షలు ఈ సంవత్సరానికే పరిమితం కాదు. రాబోయే కాలంలో విద్యార్థికి కావాల్సిన నైపుణ్యం తరగతి గదిలో లభించకుంటే, పరీక్షల్లో దానికి స్థానం ఇవ్వకుంటే ఉపాధి ప్రకటనలు వచ్చినపుడల్లా కొత్త కోచింగ్ సంస్థలు పుట్టుకొస్తాయి. కోచింగ్ సంస్థల శిక్షణ నీటిమీద రాతలే అవుతాయి. కొన్ని అంశాలు పరిచయమైనా వాటిపై పిల్లల్లో అవగాహనా శక్తి పెరగదు.
మార్పుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సిద్ధమైతేనే పరీక్ష లక్ష్యం పూర్తవుతుంది. నైపుణ్యం గల విద్యార్థికి గ్రేడ్‌లు వచ్చాయా? మార్కులు అత్యధికంగా వచ్చాయా? అని చూడకూడదు. ఆ పాఠశాలలో ఇచ్చిన శిక్షణ కూడా సమాధాన పత్రాలలో ప్రతిబింబించబడతాయి. ఆ జవాబు పత్రాలను కూడా పునఃపరిశీలన చేసుకుని అనుకున్న నైపుణ్యం పిల్లలకు వచ్చిందా? రాలేదా? ప్రస్తుత సం వత్సరంలో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని రా బోయే సంవత్సరానికి కావాల్సిన మార్గదర్శకాలు ఇవ్వవలసి వుంటుంది. ఈ ఏడాది పరీక్ష వచ్చే సంవత్సరం సిలబస్‌కు ప్రాతిపదిక అవుతుంది. కొత్త నైపుణ్యం అవసరమైతే దానికి కావాల్సిన శిక్షణ కూడా ఉపాధ్యాయులు పెంపొందించుకోవాలి.
వెనుకబడిన ప్రాంతాలు అంత తొందరగా మార్పుకు సిద్ధపడవు. అలాగే చదువులో వెనుకబడిన వారు రాబోయే జ్ఞాన నదులలోకి దిగలేరు. రాబోయే విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక వేయాలంటే ఈ ఏడాది ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలు పునఃపరిశీలన చేయాలి. పరీక్ష అయిన తర్వాత సంబంధిత శాఖలకు చాలా హోమ్‌వర్క్ ఉంటుంది. అందుకే అన్ని దేశాల్లో కూడా విద్యా శాఖలో రీసెర్చ్ వింగ్ పెడతారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం పని విధానాన్ని అది అంచనా వేస్తుంది. దాని అంచనాల ఆధారంగా ప్రణాళికలు, స్కూళ్ళలో ప్రాజెక్టులు తయారుచేసుకుంటారు. ఇది నిరంతర ప్రక్రియ.
తరగతి గదిలో ప్రధాన పరికరం- పరీక్ష. పరీక్ష అనే పదం వింటే తనకు తెలియని విషయం ప్రశ్నపత్రంలో ఏమొస్తుందోనన్న భయం విద్యార్థుల్లో ఉంటుంది. తాను చదవని విషయం, తనకు తెలియని విషయాన్ని ఏ మూల నుంచి అడుగుతారోనన్న ఆందోళన ఉంటుంది. ‘ఇవాళ ఏం వండినావ’ని తల్లిని బిడ్డ అడగటం, అందుకు ఆమె ఏదో కూర పేరు చెప్పటం జరుగుతుంది. దీనే్న ‘్ఫ్యక్ట్’ అంటాం. ఈ ప్రశ్నకు ఈనాటి వరకే సమాధానం పనికివస్తుంది. కాని ఒక తల్లిని ‘నువ్వు అన్నం వండేటప్పుడు దగ్గర ఎందుకు కూర్చుంటావు?’ అన్న దానికీ సమాధానం ఉంది. కానీ అది పుస్తకాల్లో ఉండదు. ‘నేను వండిన వంట రుచికంరగా ఉండాలనదే నా తాపత్రయం. వంట వండటం మాత్రమే ప్రధానం కాదు అది తినేవారికి రుచికరంగా ఉండాలి’ అనే సమాధానం వింటే ఆ తల్లి లక్ష్యం అర్థమవుతుంది.
ఇలాగే పరీక్షల అధికారి విద్యార్థి జ్ఞానతృష్ణను రేకెత్తించే ప్రశ్న అడిగితే, అది విద్యా ప్రమాణాలు పెంచడానికి ఉపయోగపడుతుంది, ఆలోచనా శక్తిని రేకెత్తిస్తుంది. ప్రశ్న ఆలోచించటానికి ఒక అంశం కావాలి. పుస్తకంలో ఉండే విషయానే్న అడగటం ఫ్యాక్ట్. అది అవసరం లేదని కాదు, కానీ దాని పరిమితి తక్కువ. అది ఉపరితలం వరకే ఉంటుంది. పరీక్ష అయిపోగానే ఆ అంశాన్ని విద్యార్థి మరచిపోవచ్చు. అందుకే విద్యార్థి దాన్ని కంఠస్తం చేస్తాడు. పరీక్ష అయిపోగానే ఆ అంశాన్ని మరచిపోయే అవకాశం ఉంది. కానీ పరీక్షల్లో అడిగే ప్రశ్న జ్ఞానతృష్ణను అడిగేదైతే విద్యార్థి ఆలోచనా విధానాన్ని పెంచుతుంది. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. నాలుకకో రుచి, ప్రశ్నకో రుచి అంటాం. విద్యార్థి తన ఆలోచనతో సమాధానం రాయాలి. పరీక్ష లక్ష్యం అంటే ‘్ఫ్యక్ట్’ను కనుక్కోవటం మాత్రమే కాదు విద్యార్థిలో ఆలోచనలను రేకెత్తించగలగాలి. ప్రశ్నలో ఛాయిస్ ఇవ్వటం కాదు. జవాబులో ఛాయిస్ ఉండాలి. మూల్యాంకనం (పరీక్ష) అనేది ఈనాడు మారింది. ఇలాంటి దానినే ‘క్రియేటివ్ అసెస్‌మెంట్’ అంటాం. పరీక్షా పత్రాన్ని తయారుచేయటం ఉపాధ్యాయునికి ఒక సవాలు. జవాబులివ్వటం విద్యార్థికి ఛాలెంజ్. ఈ ఇద్దరి శ్రమ తరగతి గది విజయం.

-చుక్కా రామయ్య