జాతీయ వార్తలు

జిఎస్‌టిపై ఉన్న ఆత్రుత రైతు సమస్యలపై లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్స్‌వారా (రాజస్థాన్), జూలై 19: జిఎస్‌టి అమలు చేయడంలో ఉన్నంత ఆత్రుత, రైతు సమస్యలపై చూపించడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన ‘కిసాన్ ఆక్రోశ్ ర్యాలీ’లో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతికి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. పార్లమెంటులో రైతు సమస్యలపై చర్చిద్దామంటే అందుకు అవకాశమే ఇవ్వడం లేదని అన్నారు. ‘పార్లమెంటులో అర్ధరాత్రి పూట జిఎస్‌టిని అట్టహాసంగా అమలుచేయడం మొదలుపెట్టారు కాని రైతు సమస్యలపై మాట్లాడేందుకు ఒక్క క్షణం కేటాయించడం లేదు’ అని తీవ్రంగా విమర్శించారు. జిఎస్‌టి అమలుచేసేందుకు మరికొంత కాలం ఆగాలని తమ పార్టీ చేసినన సూచనను కేంద్రం పట్టించుకోలేదని, దీనివల్ల చిన్న వ్యాపారులు, రైతులు, కూలీలు, దళితులు నష్టపోతారని ఎంత మొత్తుకున్నా వారి చెవికి ఎక్కలేదని అన్నారు. దేశాభివృద్ధిలో వీరిపాత్రే ఎక్కువగా ఉందని, రైతులు, కూలీలు చెమట చిందిస్తేనే ఉత్పత్తి వస్తుందని తమ పార్టీ విశ్వసిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఫలాలు దేశంలోని 50 బడా పారిశ్రామికవేత్తలకే అందుతున్నాయి తప్ప పేదలకు చేరడం లేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేసిందని, అయితే పక్కనున్న పంజాబ్, కర్నాటక రాష్ట్రాల్లో అటువంటి ఉపశమన చర్యలు ఏవీ కనిపించడం లేదని అన్నారు. రాజస్థాన్‌లో రైతు రుణాలు మాఫీ చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. దేశంలో రెండు కోట్ల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న బిజెపి ఎన్నికల హామీ ఏమైందని నిలదీశారు.
చిత్రం.. రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో బుధవారం నిర్వహించిన
‘కిసాన్ ఆక్రోశ్ ర్యాలీ’లో విల్లు ఎక్కుపెడుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్