జాతీయ వార్తలు

నాగా కొత్త సిఎం జెలియాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా, జూలై 19: నాగాలాండ్ రాజకీయ పరిణామాలు బుధవారం అనూహ్య మలుపులతో ముగిశాయి. ఒకదాని తర్వాత ఒకటిగా నాటకీయ ఫక్కీలో సాగిన రాష్ట్ర రాజకీయం సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించింది. బలపరీక్షకు రాకపోవడంతో ముఖ్యమంత్రి షుర్హోజిలీ లీజిత్సును గవర్నర్ పి.బి.ఆచార్య బర్తరఫ్ చేశారు. తిరుగుబాటు నాయకుడు టి.ఆర్.జెలియాంగ్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. ఆయన చేత కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరో పరిణామం చోటుచేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై జెలియాంగ్‌ను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌డిఎఫ్) ప్రకటించింది. అధికార పార్టీని ముంచేసే రీతిలో జెలియాంగ్ వ్యవహరించారని, అందుకే ఆయనపై బహిష్కరణ వేటు వేశామని ఎన్‌పిఎఫ్ తాత్కాలిక అధ్యక్షులు హుస్కా ఎప్తోమి, అపాంగ్ పాంజినెర్ తెలిపారు. అయితే ఈ పరిణామాలు ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి జెలియాంగ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్‌పిఎఫ్ నాయకుడిగానే కొనసాగుతానని వెల్లడించారు. పార్టీనుంచి తనను బహిష్కరించినంత మాత్రాన అసెంబ్లీలో తన సభ్యత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. నేటి ఉదయం లిజిత్సు బలపరీక్ష కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచినప్పటికీ ఆయన గానీ, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు గానీ సభకు రాలేదు. దాంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్‌భవన్‌కు జెలియాంగ్‌ను పిలిపించిన గవర్నర్ దర్బార్ హాలులో స్పీకర్ ఇంతివాపాంగ్ అయర్, 42మంది ఎన్‌పిఎఫ్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విసా చౌరి లొంగు సమక్షంలో ఆయనచేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్‌పిఎఫ్ సారథ్యంలోని నాగాలాండ్ ప్రజాస్వామ్య కూటమి (డాన్) ప్రభుత్వానికి రెండోసారి సారథ్యం వహించిన జెలియాంగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21న అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకుంటానన్నారు. 22లోగా బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ తనను ఆదేశించినప్పటికీ 21న సభా విశ్వాసాన్ని చూరగొంటానని జెలియాంగ్ తెలిపారు. మెజారిటీని రుజువు చేసుకున్న తర్వాతే మంత్రివర్గాన్ని ఏర్పాటుచేస్తానన్నారు.
చిత్రం.. నాగాలాండ్ కొత్త సిఎం టి.ఆర్.జెలియాంగ్