జాతీయ వార్తలు

బిహార్ సంక్షోభానికి తాత్కాలిక తెర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 19: బిహార్‌లో అధికార కూటమిలోని ప్రధాన పక్షాలయిన జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి)ల మధ్య విభేదాలకు తాత్కాలికంగా తెరపడినట్లు తెలుస్తోంది. ఆర్‌జెడి అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ కుటుంబ సభ్యుల అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌ను ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని జెడి (యు) అధ్యక్షుడు కూడా అయిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోరడం, అందుకు నాలుగు రోజుల డెడ్‌లైన్ విధించడం తెలిసిందే. అయితే తానెలాంటి తప్పూ చేయలేదని, అందువల్ల రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేజస్వి యాదవ్ తేల్చి చెప్పడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి తేజస్వి యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ ఇద్దరు నేతలు ఏమి చర్చించుకున్నారనే విషయం స్పష్టంగా తెలియరాలేదు కానీ, మీడియాలో వచ్చిన కథనాలే గనుక నిజమైన పక్షంలో ఇరువురు నేతలు రాజీకి వచ్చారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని తేజస్వి యాదవ్‌కు నితీశ్ చెప్పినట్లు జీ న్యూస్ చానల్ కథనం పేర్కొంది. కాగా, ఈ సమావేశంలో తేజస్వి యాదవ్ ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న ఆరోపణలపై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు 50 నిమిషాలపాటు జరిగిన కేబినెట్ భేటీకి లాలూప్రసాద్ మరో కుమారుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చౌధరి కూడా హాజరయ్యారు. ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్న ఆస్తులపై సిబిఐ దాడులు నిర్వహించి తేజస్వి యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటినుంచి బిహార్‌లో అధికారంలో ఉన్న మహా సంఘటన్‌లో విభేదాలు తలెత్తడం తెలిసిందే.