అంతర్జాతీయం

జి-20 సదస్సులో ట్రంప్-పుతిన్ రహస్య భేటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 19: జర్మనీలో ఈ నెల ప్రారంభంలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండోసారి రహస్యంగా సమావేశమైనట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే జి-20 నేతలకు ఇచ్చిన విందు సందర్భంగా ఇరువురు నేతలు కొద్ది సేపు మాట్లాడుకున్న మాట నిజమేనని పేర్కొన్న వైట్‌హౌస్ ఈ రెండో భేటీని దాచి పెట్టడానికి వైట్‌హౌస్ ప్రయత్నించిందని చెప్పడం శుద్ద తప్పని, అర్థం లేనిదని స్పష్టం చేసింది. వివిధ పత్రికల్లో ట్రంప్-పుతిన్ రహస్య భేటీనుంచి కథనాలు వచ్చిన నేపథ్యంలో వైట్‌హౌస్ మంగళవారం రాత్రి ఈ వివరణ ఇచ్చింది. నిర్మాణాత్మక చర్చల్లో భాగంగా మొదట జరిగిన రెండున్నర గంటల సమావేశానికి అదనంగా జరిగిన ఈ సమావేశం దాదాపు గంటసేపు జరిగిందని మీడియా కథనాలు తెలిపాయి. అయితే అధ్యక్షుడి విధుల్లో భాగంగానే ఈ సమావేశం జరిగిందని జి-20 సమావేశంలో, అలాగే సమావేశానికి హాజరయిన ఇతర దేశాల నేతలతో సమావేశాల్లో ట్రంప్ మన ప్రయోజనాలు, విలువలకు ప్రదర్శించి అమెరికా నాయకత్వాన్ని చాటారని వైట్‌హౌస్ ఈ సమావేశాన్ని సమర్థిస్తూ చేసిన ప్రకటనలో తెలిపింది. జి-20 సమావేశం చివరిరోజు రాత్రి జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సమావేశానికి హాజరయిన వివిధ దేశాల నేతలందరికీ విందు ఇచ్చారని వైట్‌హౌస్ ఆ ప్రకటనలో తెలిపింది. విందు ముగిశాక ట్రంప్ తన భార్య కూర్చున్న సీటు వద్దకు వెళ్లారని, అప్పుడు పక్కనే ఉన్న పుతిన్‌తో కొద్దిసేపు మాట్లాడారని తెలిపింది. విందులో పాల్గొన్న నేతలందరూ పరస్పరం స్వేచ్ఛగా మాట్లాడుకోవడం సహజమని, ఇందులో రహస్యం ఏమీ లేదని కూడా ఆ ప్రకటన స్పష్టం చేసింది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి రష్యా సహకరించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు రహస్యంగా భేటీ కావడంపై ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక అనుమానాలు వ్యక్తం చేసింది.