రాష్ట్రీయం

మరో రాకెట్ గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: డ్రగ్స్ వినియోగంలో ఒకవైపు పూరీ జగన్నాథ్‌ను ఎక్సైజ్, సిట్ అధికారులు విచారిస్తుండగా, హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఇద్దరు నైజీరియన్లతో సహా 9మందిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేయడంతో కలకలం రేపింది. బంజారాహిల్స్‌లో ఆరుగురిని, మాసాబ్ ట్యాంక్‌లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ ఎంతగా సరఫరా అవుతున్నాయో, ఎంతమంది బానిసలయ్యారో, ఇంకా ఎంతమంది వెలుగులోకి వస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
బుధవారం పట్టుబడిన ముఠా, చాలాకాలంగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్టు నిర్థారించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో టాస్క్ ఫోర్సు పోలీసులు చాకచక్యంగా వలవేసి పట్టుకున్నారు. పట్టుబడిన తొమ్మిది మందిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు. వారి నుంచి 300 గ్రాముల కొకైన్, 42 గ్రాముల ఎండిఎంఎ (డ్రగ్), 27 ఎల్‌ఎస్‌డి/ ఎల్‌ఎస్‌ఎ (స్టాంపుల రూపంలో) డ్రగ్ యూనిట్లు, ఓ కారు (ఏపి 11 0బిఇ 9509), వెయింగ్ మిషన్-12, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నైజీరియా దేశానికి చెందిన చికా ఓక్వౌయుసి 2012లో గోవాకు వచ్చి స్థిరపడ్డాడు. అక్కడ వస్త్ర వ్యాపారం చేసుకుంటూనే మెల్లిగా మత్తు పదార్థాల విక్రయాన్ని చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సౌత్ ఆఫ్రికా, డక్ జిల్లానుంచి స్టూడెంట్ వీసాపై ముంబయికి వచ్చిన లక్కీ బొనగానీ 2014-16లో ఢిల్లీలో బిఎస్సీ పూర్తిచేసి, తర్వాత హైదరాబాద్ మణికొండలో ఫ్రెండ్స్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. పట్టుబడిన మరో నిందితుడు హైదరాబాద్‌కు చెందిన ఎన్ రఘు వంశీధర్‌రెడ్డి ప్రైవేటు ఉద్యోగి అని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన అభినవ్ మహేందర్ బికామ్ పూర్తిచేసిన తర్వాత క్యాటరింగ్ వ్యాపారాన్ని ముంబయిలో ప్రారంభించినా, గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన వి మల్లికార్జున్ 2010లో బిటెక్ పూర్తి చేసి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరుకు చెందిన క్రిస్ట్ఫోర్ హెచ్‌హెచ్ గిడ్డెన్స్ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇలాఉండగా 2015 డిసెంబర్‌లోఎన్ రఘు వంశీధర్ రెడ్డి ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్ళి ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగంలో చేరారు. కాగా ఆ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు తిరిగివచ్చి కూకట్‌పల్లిలో తన తల్లిదండ్రులతో ఉన్నాడు. బెంగళూరులో ఉన్నప్పుడే గంజాయి వాడకానికి అలవాటుపడ్డాడు. ఎల్‌ఎస్‌డి, కొకైన్‌కు బానిసయ్యాడు. 2015లో గంజాయి కేసులో చేవేళ్ళలో కొడంగల్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో ఉన్నప్పుడే క్రిస్ట్ఫోర్‌తో పరిచయం ఏర్పడడంతో, వంశీ మరి కొందరిని పరిచయం చేశాడు. ఇలా ముఠా ఏర్పాటైంది.
ఇక రెండో కేసులో మాసాబ్ ట్యాంక్, ప్యారడైజ్ హోటల్ లైనులో టాస్క్ ఫోర్సు పోలీసులు, సైఫాబాద్ పోలీసులు సంయుక్తంగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. బోయిగుడాకు చెందిన పి రేవంత్, లక్‌డీకాపూల్‌కు చెందిన ఇర్‌ఫాన్ నజీబ్ ఖాన్, జైన్‌ఖాన్ ఉన్నారు. పి రేవంత్‌కు హుక్కా సెంటర్లకు వెళ్ళే అలవాటు ఉండేది. దీంతో గంజాయి అలవాటున్న వారితో పరిచయం ఏర్పడింది. అది కాస్త గోవా వరకు తీసుకెళ్ళింది. అక్కడ కొకైన్ వంటి మత్తుపదార్థాలకు అలవాటుపడడమే కాకుండా, తక్కువ ధరకు ఖరీదు చేసి వాటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయించడం వ్యాపారంగా పెట్టుకుని, చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఇంకా ర్యాకెట్‌లో ఎంతమంది ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.