రాష్ట్రీయం

జెసిపై నిషేధం ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి విమానయానంపై ఇండిగోతోపాటు ఇతర విమాన సంస్థలు విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. దివాకర రెడ్డి నెల రోజుల క్రితం విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందిపట్ల దురుసుగా వ్యవహరించటంతోపాటు ఒకరిపై చేయి చేసుకున్నారనేది ఆరోపణ. ఇండిగో సిబ్బందితో దురుసుగా వ్యవహరించినందుకే ఇండిగోతోపాటు ఇతర విమానయాన సంస్థలు దివాకర్‌రెడ్డి ప్రయాణంపై నిషేధం విధించారు. అందుకే ఆయన ఈ నెల 17న రాష్టప్రతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు దాదాపు ఏడు లక్షల రూపాయలు ఖర్చుతో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రావలసి వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి విమానయాన సంస్థల యాజమాన్యాలతో చర్చించిన అనంతరం ఇరువురి మధ్య సయోధ్య కుదుర్చినట్లు తెలిసింది. దివాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పేందుకు ససేమిరా అనడంతో మధ్యేమార్గంగా వౌఖికంగా విచారం ప్రకటించేలా చేసినట్లు తెలిసింది. అయితే దివాకర్‌రెడ్డి మాత్రం తాను లిఖితపూర్వకంగా లేదా వౌఖికంగా ఎలాంటి క్షమాపణ చెప్పలేదని స్పష్టం చేశారు. వారు ఎందుకు నిషేధం విధించారు, ఎందుకు తొలగించారనేది తనకు తెలియదని దివాకర్ రెడ్డి విలేఖరులకు చెప్పారు. శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజారపు రామమోహన్ నాయుడు వివాహానానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో దివాకర్‌రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో విమానయాన సిబ్బందితో గొడవ పడడం తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే రామమోహన నాయుడు బుధవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల ఎంపీలకు విందు ఏర్పాటుచేశారు. ఆ సమయంలోనే దివాకర్‌రెడ్డి విమానయానంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయటం గమనార్హం. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫెడరేషన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
గూండా ఎంపీ అన్నందుకు కేసు
ఇండిగో విమాన సంస్థ సిబ్బందితో గొడవ పడినందుకు తనను గూండా ఎంపీగా చిత్రీకరించిన రెండు టివి చానళ్లపై దివాకర్‌రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఆ టివి చానళ్లు తనను గూండాగా సంబోధించటంతోపాటు పరుష పదజాలంతో దుర్భాలాడినందుకు చర్య తీసుకోవాలని దివాకర్ రెడ్డి తన పిటిషన్‌లో కోరుతున్నారు.