తెలంగాణ

పూర్ణిమ వాంగ్మూలం నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: హైదరాబాద్ కూకట్‌పల్లిలో అదృశ్యమై ముంబయిలో ప్రత్యక్షమైన విద్యార్థిని పూర్ణిమసాయి వాంగ్మూలాన్ని మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, కూకట్‌పల్లి ఏసిపి భుజంగరావు నమోదు చేశారు. బాలిక పూర్ణిమసాయిని ముంబయి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కాగా..తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి పూర్ణిమ ఇష్టపడడం లేదు. దీంతో ఆమెకు డిసిపి, ఏసిపి కౌనె్సలింగ్ ఇచ్చారు. కాగా అసలు పూర్ణిమసాయి ఇంట్లోంచి వెళ్లిపోవడానికి, తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి ఇష్టపడకపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా పూర్ణిమసాయి తమతో వచ్చేందుకు ఒప్పుకుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. బాలల సంరక్షణ కమిటీ సమావేశమై బాలికతో మాట్లాడిన తరువాత నిబంధనల ప్రకారం తమకు అప్పగిస్తారని బాలిక తల్లిదండ్రులు నాగరాజు, విజయ తెలిపారు. కాచిగూడలోని నింబోలిఅడ్డాలో గల బాలికా సదనంలో ఉన్న పూర్ణిమను చూసేందుకు వారు బుధవారం మధ్యాహ్నం వచ్చారు. సుమారు 3గంటల పాటు వేచిచూసిన తరువాత బాలికతో మాట్లాడేందుకు అధికారులు అనుమతించారు. తమ కుమార్తెతో మాట్లాడిన తరువాత తల్లిదండ్రుల వెంట వెళ్ళేందుకు పూర్ణిమ సాయి అంగీకరించినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో బాలల సంరక్షణ కమిటీ సమావేశమై పూర్ణిమ అభిప్రాయాన్ని తెలుసుకున్న పిమ్మట తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. కాగా పూర్ణిమ తిరిగి ఇంటికి వస్తుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.