ఆంధ్రప్రదేశ్‌

జలదిగ్బంధంలో విలీన మండలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, జూలై 19: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో శబరి నది సహా, అనుబంధ వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో తూర్పు గోదావరిలో వీలీనమైన చింతూరు, విఆర్‌పురం మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోకిలేరు, చంద్రవంక, జల్లివారిగూడెం, కుయిగూరు, చీకటి వాగులు పొంగి పొర్లుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలు బుధవారం జలదిగ్బంధం చేశాయి. కోకిలేరు, చీకటి, కుయిగూరు, జల్లివారిగూడెం వాగులు పరవళ్లు తొక్కుతూ రహదార్లపై ప్రవహిస్తున్నాయి. దీనితో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు చింతూరు రావాలంటే నాటుపడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోకిలేరు, చీకటి, జల్లివారిగూడెం వాగులు రహదారి పైనుంచి ప్రవహిస్తుండటంతో చింతూరు, విఆర్ పురానికి రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అలాగే గవల్లకోట, చదలవాడ, కవులూరు, లక్కగూడెం, మిట్టవాడ గ్రామాలను కోకిలేరు వాగు చుట్టుముట్టడంతో ఈ గ్రామప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కోకిలేరు వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో నాటుపడవలు నడిచే అవకాశం కూడా లేదు. దీనితో గ్రామప్రజలు ఓ ద్వీపంలో ఉన్నట్టు తలపిస్తోంది. కుయిగూరు వాగు పొంగి పొర్లుతూ రహదారిపై ప్రవహించడంతో చింతూరు నుండి కుయిగూరు, కల్లేరు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ గ్రామాలకు వెళ్లాలంటే ఇక్కడ సైతం నాటుపడవ ఎక్కి ప్రయాణించాల్సిందే. బుధవారం సాయంత్రానికి శబరి నది 31 అడుగులకు చేరుకుని ప్రవహిస్తోంది.