ఆంధ్రప్రదేశ్‌

ఫిర్యాదుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 19: విశాఖ భూ కుంభకోణాలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల కబ్జాలు, దురాక్రమణలు, క్రయ, విక్రయాలకు సంబంధించి నిరభ్యంతర సర్ట్ఫికెట్ల (ఎన్‌ఓసి) జారీపై కూడా సిట్ దర్యాప్తు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇప్పుడు పలు ప్రభుత్వ శాఖలు తమ భూముల దురాక్రమణలపై సిట్‌కు నివేదికలు ఇస్తున్నాయి. తాజాగా సింహాచలం దేవస్థానం నుంచి అధికారిక బృందం సిట్ దర్యాప్తు అధికారులను బుధవారం కలిసి నివేదిక అందజేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వ భూములకు సంబంధించి ఆక్రమణలపై సిట్ పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో సింహాచలం దేవస్థానం అధికారులు తమ భూములకు సంబంధించి ఆక్రమణల చిట్టాతో నగర పోలీసు కమిషనర్ యొగానంద్‌తో కలిసి సిట్ విచారణ అధికారికి సమర్పించింది. దేవస్థానం ఆధీనంలో ఉన్న పద్మనాభం మండలం అనంత పద్మనాభ స్వామి దేవస్థానానికి చెందిన పలు భూములు ఆక్రమణలకు గురైనట్టు నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అలాగే మాన్సాస్ ఆధీనంలోని పలు దేవస్థానాలు, సత్రాలు, విద్యా సంస్థలకు చెందిన భూముల ఆక్రమణలపై కూడా సిట్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. పద్మనాభం మండలం గంగసాని అగ్రహారంలో విశే్వశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూములు, నీలమ్మ సత్రానికి చెందిన భూముల వ్యవహారాలను సిట్ అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్టు సమాచారం. వీటితో పాటు మాన్సాస్ సంస్థకు చెందిన భూముల ఆక్రమణల అంశాన్ని కూడా సిట్ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది.