ఆంధ్రప్రదేశ్‌

‘సిట్’ ఎదుట లెక్కనేనన్ని సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 19: విశాఖ భూ కుంభకోణాన్ని దర్యాప్తు జరిపేందుకు నియమించి సిట్ అధికారులు అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. సిట్‌కు ఇప్పటికే దాదాపూ 2600 ఫిర్యాదులు అందాయి. వీటిలో మెజార్టీ ఫిర్యాదులు అధికార పార్టీ నేతలపైనే. ఇప్పటి వరకూ వచ్చిన ఫిర్యాదులన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి, అతని బంధువులతోపాటు, అధికార పార్టీ సీనియర్ నేతలపైనే ఉన్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రికార్డుల తారుమారుతోపాటు, ప్రభుత్వ భూములను చూపించి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వైనాన్ని సాక్ష్యాధారాలతో సిట్‌కు అందచేస్తున్నారు. బుధవారం కూడా మరికొన్ని భూముల రికార్డుల తారుమారుకు సంబంధించిన దస్త్రాలను సిట్‌కు అందచేశారు. అలాగే బీచ్ రోడ్డులో విలువైన స్థలాన్ని ఓ ఎమ్మెల్యే ప్రైవేటు వ్యక్తికి అప్పగించి, అందులో అపార్ట్‌మెంట్‌లు నిర్మించుకునేందుకు అనుమతులు మంజూరు చేయించడాన్ని సిట్ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో నగర నడిబొడ్డునున్న అత్యంత విలువైన గ్రంథాలయ భూమిని అభివృద్ధి చేసి, అత్యాధునిక గ్రంథాలయాన్ని నిర్మించేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ తరపున ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఇప్పటి వరకూ ఆ భూమిని అభివృద్ధి చేయలేదు. దీనిపై అప్పటి గ్రంథాలయ సంస్థ చైర్మన్, ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్న తోట నగేష్ కూడా గురువారం సిట్ అధికారులను కలిసి ఫిర్యాదు ఇవ్వనున్నారు. భూ కుంభకోణంలో అధికార పార్టీ నాయకులే భాగస్వాములుగా ఉండగా, వారిపై స్వపార్టీ వారే ఫిర్యాదు చేయడం చంద్రబాబుకు శిరోభారంగా మారబోతోంది. మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం సిట్‌ను కలిసి విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై ఫిర్యాదు ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మెడ్‌టెక్ భూముల విషయంలో దాదాపూ 23 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఆయన సిట్‌కు అందించారు. మంత్రి అయ్యన్న బుధవారం మరోసారి సిట్ అధికారులను కలిసి మెడ్‌టెక్ కుంభకోణంపై సాక్ష్యాధారాలను సమర్పించాలని అనుకున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఒత్తిడి మేరకు ఆయన సిట్ ముందుకు రాలేకపోతున్నట్టు తెలిసింది.
‘మెడ్‌టెక్’ బాధ్యులను విచారించిన సిట్
ఇదిలా ఉండగా మెడ్‌టెక్ భూ కుంభకోణానికి సంబంధించి ‘అధికార పార్టీ మెడకు మెడ్‌టెక్ ఉచ్చు’ అన్న శీర్షికతో మంగళవారం ప్రచురించిన కథనంపై సిట్ అధికారులు స్పందించారు. దీనికి సంబంధించి మెడ్‌టెక్ భూ సేకరణ కోసం నియమించిన అప్పటి స్పెషల్ ఆఫీసర్‌ను, పెదగంట్యాడ తహశీల్దారును, విఆర్‌ఓను సిట్ అధికారులు మంగళవారం పిలిపించి విచారించారు. ప్రభుత్వాన్ని ఏ మేరకు మోసం చేశారన్న అంశంపై వీరిని ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. వీరు నోరు విప్పితే, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితోపాటు, తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీ నాయకుల జోక్యం ఉన్న కేసులను సిట్ ఏ విధంగా దర్యాపు చేస్తుంది? సిట్ పరిధికి మించిన ఫిర్యాదులు వస్తున్నాయా? దర్యాప్తు చేయకుంటే, విపక్షాలు, ప్రజలు ప్రభుత్వాన్ని నిందించే పర్థితి ఉంటుంది. ఇలాంటి సవాళ్ల మధ్య సిట్ పనిచేయాల్సి వస్తోంది.