కృష్ణ

ప్రాజెక్టులపై ఉండవల్లిది అవగాహన రాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 19: పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, తదితరులు పత్రికా ప్రకటనలో చేస్తున్నారని రాష్ట్ర సాగునీటి సంఘాల సారథులు విమర్శించారు. నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో జలవనరుల శాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, కృష్ణా తూర్పుడెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, తదితరులు విలేఖరులతో మాట్లాడుతూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ గత రెండేళ్లుగా టిడిపి ప్రభుత్వం తలపెట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. పసలేని ఆరోపణలతో పట్టిసీమపై అబద్ధాలను ప్రచారం చేస్తూ కృష్ణాడెల్టా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా గోదావరి, కృష్ణా నదులను పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి గత సంవత్సరం 56 టిఎంసిల గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తీసుకొచ్చి కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 13లక్షల ఎకరాల పంటను కాపాడి రూ. 7వేల కోట్ల ఆదాయాన్ని రైతులకు వచ్చేటట్లు చేయటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
గత పదేళ్ల కాంగ్రెస్ హయాంలో పోలవరం కుడి, ఎడమ కాలువలు మాత్రమే తవ్వి డ్యామ్‌ను గాలికి వదిలేశారన్నారు. అప్పట్లో నిర్వాసితులకు కేవలం ఎకరానికి లక్షన్నర రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, 2013 భూసేకరణ చట్టం వచ్చిన తరువాత నిర్వాసితులను ఎకరానికి 10 లక్షలకు పైగా నష్టపరిహారం ఇస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు భూసేకరణకే రైతులకు రూ. 32వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రాజెక్టు విలువ రూ. 16వేల కోట్లుగానే ఉందంటూ మొత్తం ప్రాజెక్టు విలువ ప్రస్తుతం రూ. 48వేల కోట్లకు చేరిందని తెలిపారు. వాస్తవ పరిస్థితి ఇలావుంటే కేవలం కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు విలువను పెంచారని ఉండవల్లి, తదితరులు ఆరోపించటం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్ల బడ్జెట్లలో జలవనరుల శాఖకు రూ. 40వేల కోట్లు కేటాయించి రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీరు-ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజలకు నీటి భద్రత కల్పించి నీరు-చెట్టు కార్యక్రమంలో గత రెండేళ్ల కాలంలో చెరువుల పూడికతీత, వాగులు వంకలు లోతు చేయటం, చెక్‌డ్యాంలు, పంటకుంటల నిర్మాణం ద్వారా 50వేల కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీసి రాష్టవ్య్రాప్తంగా 35 టిఎంసిల భూగర్భ జలాలను నిల్వచేసి 3.5 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టును స్థిరీకరించారన్నారు. పట్టిసీమ వల్లే జూన్‌లో కృష్ణాడెల్టాను నీరు ఇవ్వటం సాధ్యమైందని, దీనివల్ల నవంబరులో వచ్చే తుపానుల నుండి వరి పంటను కాపాడుకోవచ్చన్నారు. ఆగస్టు తరువాత కృష్ణానది ఎగువ భాగంలో వచ్చిన నీటితో శ్రీశైలం పైన పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ రైతులకు సాగునీరు ఇవ్వటం కేవలం పట్టిసీమ వల్లనే సాధ్యమైందన్నారు. ఈ విషయం కూడా తెలియని విమర్శకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని వారు ఖండించారు. విలేఖరుల సమావేశంలో రాష్ట్ర నీటి సంఘాల ప్రతినిధులు సిహెచ్ ప్రసాదరావు, ఎస్ శివరామప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.