కృష్ణ

గూడు లేని ట్రస్ట్ బోర్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూలై 19: దుర్గగుడి ట్రస్ట్ బోర్డు కమిటీకి ఇప్పటి వరకు చాంబర్ లేకపోవటంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు రాజగోపురం ముందే నిలబడి వచ్చిన విఐపిలకు స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం చేయిస్తూ అమ్మవారి సేవలో పలు వర్గాల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొండపైనున్న నిర్మాణాలు కూల్చకముందు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యులకు అందరికీ ఒక ప్రత్యేక సమావేశ హాలు, చైర్మన్‌కు ప్రత్యేక హాలు, వీటితోపాటు ఒక గుమస్తా, అటెండర్ తదిరత సదుపాయాలు ఉండేవి. మాస్టర్‌ప్లాన్ ప్రకారం దుర్గగుడి అభివృద్ధి పేరుతో ఉన్న నిర్మాణాలు ముందు చూపులేకుండా కూల్చి వేయటంతో ప్రస్తుతం కొండపైన ఎటువంటి సదుపాయాలు లేవు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం దుర్గగుడికి ట్రస్ట్‌బోర్డును ఏర్పాటు చేసింది. కానీ ధర్మకర్తలు కూర్చోవటానికి కొండపైనా ఎటువంటి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయకపోవటంతో కొండపైకి వచ్చిన ధర్మకర్తలు కేవలం స్డాండింగ్‌కే పరిమితమైన పరిస్థితిని గమినించిన కమిటీ సభ్యులు కొండపైనున్న విఐపి లాంజ్‌ను ప్రస్తుతం కేటాయించాలని ఇవో సూర్యకుమారికి విజ్ఞప్తి చేయగా ఆమె అందుకు అంగీకరించకుండా రాజకుమారి థియేటర్ ఎదురుగా ఉన్న మాడపాటి సత్రంలో సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తామని అక్కడ నుంచే విధులు నిర్వహించాలని చెప్పటంతో ధర్మకర్తలు అందుగు అంగీకరించలేదని సమాచారం. ఇవో, ధర్మకర్తల మధ్య ఏర్పడిన అగాధం ఇప్పట్లో తేలే అవకాశం లేదని తెలిసింది. గత దసరా మహోత్సవాలు ప్రారంభంలోనే ప్రభుత్వం దుర్గగుడికి ట్రస్ట్ బోర్డును ప్రకటించినప్పటికీ జివో విడుదల చేయకపోవటంతో దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి ఇదే ట్రస్ట్‌బోర్డు సభ్యులను దూరంగా పెట్టారు. ఆ సమయంలో అధికారం లేదన్న సాకుతో ఇవో ఈవిధంగా ప్రవర్తించటంలో తప్పులేదని అధికారులు ఇవో పనితీరును సమర్థించారు. కానీ ప్రస్తుతం ధర్మకర్తలకు పూర్తిస్థాయిలో అధికారం ఉన్నా ఇవో చర్యలను వ్యతిరేకించేందుకు భయపడటం వెనుక రహస్యం ఏమిటోనని వివిధ వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయ.