హైదరాబాద్

జిహెచ్‌ఎంసి కంట్రోల్‌కు 360 ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: మహానగరంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి జిహెచ్‌ఎంసి కమాండ్ కంట్రోల్ రూంకు 360 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో ఇప్పటి వరకు 230 ఫిర్యాదులను పరిష్కరించినట్లు, మిగిలినవి వివిధ దశల్లో పరిష్కార దశల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. డయల్ 100, జిహెచ్‌ఎంసి కాల్ సెంటర్ 040-21111111, ఆన్‌లైన్, మై జిహెచ్‌ఎంసి మొబైల్ యప్ ద్వారా ఈ మొత్తం ఫిర్యాదులందినట్లు తెలిపారు. వీటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. జిహెచ్‌ఎంసి కమాండ్ కంట్రోల్ స్వీకరించే ఈ ఫిర్యాదులను, వాటి ప్రాధాన్యతను బట్టి ఆయా విభాగాల అధికారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా రోడ్ల మరమ్మతులు, రోడ్లపై గుంతలను యుద్దప్రాతిపదికన పూడ్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల 16 చెట్లు కూలాయని వివరించారు. ఈ వర్షాలకు సంబంధించి అందిన ఫిర్యాదుల్లో 51 ఫిర్యాదులు జలమండలికి సంబంధించినవి కూడా ఉన్నాయని వివరించారు.