డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమే! కాని అబాండ్‌మెంట్ అండ్ రిజెక్షన్ చెడగొట్టగలరు.
మొత్తంమీద ఆ రోజు మా ఇద్దరిమధ్య పెద్దగా సంభాషణ సాగలేదు.
కలిసి డిన్నర్‌కి వెళ్లాం. సినిమాకు వెళ్లాం. తేజ లాన్సింగ్ వెళ్లిపోయింది.
‘‘కానీ, తరువాత మాకు తెలియకుండానే చేరువ అయ్యాం. ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళం కాదు. కానీ, తేజ మళ్లీ ఆ విషయాలు ఎప్పుడూ మా సంభాషణలోకి తేలేదు’’ అన్నాడు వౌళి.
కారు హోటల్ చేరింది.
‘‘మూర్తిగారు ఏమీ అడగలేదా నిన్ను?’’ అని అడిగాను.
లేదన్నట్లు తల ఊగించాడు.
‘‘ఆయన అసలు ఆ టాపిక్ ఎప్పుడూ తేలేదు. కానీ నేను తేజాతో స్నేహం చేస్తున్నానని తెలియగానే నన్ను గురించి చాలా వాకబు చేయించారు. ఆ ఊళ్ళో ఉన్న ఆయన స్నేహితుల ద్వారా, యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ల ద్వారా!’’
‘‘ఇండియాలో కూడా వాకబు చేయించారేమో నీకు తెలియకుండా’’ అంటూ నవ్వాడు.
‘‘మంచిదేగా! అన్ని విషయాలు ముందుగా తెలిసి ఉంటే తరువాత నిరాశ పొందవలసిన అవసరం ఉండదు’’ అంటూ నేనూ నవ్వాను.
‘‘కానీ ఎప్పుడూ డా.రఘురాం గురించి మాట్లాడలేదా? నిన్న రాత్రిదాకా’’ అన్నాను.
తేజ ఏమయినా చెప్పిందేమో! నేను తేజాని అడగలేదు’’ అన్నాడు వౌళి.
ఆ సాయంత్రం హోటల్ రూంకి వెళ్లి హాయిగా స్నానం అది చేసి ఓ కప్ కాఫీ తాగి తీరిగ్గా తేజ వాళ్ళ ఇంటికి వెళ్లాం.
బయట చాలా హాయిగా ఉంది. సమ్మర్ మూలంగా 7 గంటలు దాటినా అసలు వెలుగే తగ్గలేదు. లేత గులాబి, కాటన్ చీర కట్టుకున్నాను. అంతే మరే ప్రత్యేకతా లేదు. నాకు అలంకరించుకునే అలవాటు అసలు అవ్వలేదు. చిన్నప్పుడు కోల బొట్టు పెట్టుకునేదాన్ని. ఉద్యోగంలో చేరంగానే అది గుండ్రంగా మార్చేశాను. కొంచెం పెద్దరికం కనిపిస్తుందేమోనని.
వదిన కూడా నే కట్టుకునే చీరలు కూడా కొంచెం ఏరి సెలెక్ట్ చేసేది. నువ్విలాగే కాలేజీకి వెడితే ఎవ్వరూ నువ్వో లెక్చరర్‌వి అనుకోరు. నువ్వో ఓ స్టూడెంట్ అనే అనుకుని, ఏ కుర్రాడయినా వెనకబడేను. అంటూ వదిన, నాకు కాస్త పెద్దరికం అంటగట్టాలని చూసేది.
‘‘వదినా, మెట్యురిటీ అనేది మనసుకు ఉండాలి. శరీరానికి దానంతట అదే వస్తుంది అనేదాన్ని’’.
‘‘మన మనసు ఎవరికి తెలుసు? మనకే తెలీదు. అందుకనే శరీరంపై కనిపించాలి’’ అనేది.
ఈ పింక్ చీర కూడా వదినే సెలక్ట్ చేసింది. ఇదేమిటి, నా అమెరికా ట్రిప్‌కి అంతా ఆవిడదే సెలక్షన్.
ఎలివేటర్ ముందున్న అద్దంలో నన్ను చూస్తూ వౌళి అడిగాడు. ‘‘ఇది కూడా అత్తయ్య సెలక్షన్ కదా!’’ అని నవ్వుతూ.
వాడికి తెలుసు- ఇన్నప్పుడు ఎప్పుడూ నన్ను, వదినను చూస్తూ, మా మాటలు వింటూ ఉండేవాడు.
‘‘అహా! అన్నాను. నావేమిటి, తేజాకి కొన్నవి కూడా ఆవిడదే సెలక్షన్’’ అన్నాను.
నవ్వాడు. ‘‘అత్తయ్య, మామయ్యా వచ్చి ఉంటే బాగుండేది’’ అన్నాడు సాలోచనగా!
‘‘నేను అదే అన్నాను మామయ్యతో. కానీ, మామయ్య పెద్దవాడయిపోతున్నాను. ప్రయాణం చేయలేనన్నాడు. కానీ, నిజం ఏమిటంటే- అమ్మమ్మని, తాతయ్యని వదిలి రావడం ఇష్టంలేదు’’ అన్నాను.
తేజ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ముందు లివింగ్ రూంలో నలుగురైదుగురు మగవాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. లోపల వంటింటిలోంచి మాత్రం చాలా కోలాహలం వినిపిస్తోంది.
మా ఇద్దరినీ చూడంగానే మూర్తిగారు హడావిడిగా ఎదురొచ్చారు. ‘‘సావిత్రీ!’’ అంటూ భార్యను పిలుస్తూ!
ఆవిడ కూడా లోపల నుంచి వచ్చింది చెయ్యి కడుక్కోకుండానే. లోపల ఏదో వండుతున్నట్లున్నారు.
‘‘మీరా! రండి రండి’’ ఆహ్వానించింది. ‘‘కూచోండి. ఇప్పుడే వస్తాను అంటూ లోపలకు పరిగెత్తింది. తిరిగి తువ్వాలుతో చేతులు తుడుచుకుంటూ’’ అన్నీ చూసొచ్చారా’’ అంటూ వచ్చింది.
‘‘ఏం తీసుకుంటారు- కాఫీ, టీ, జ్యూస్’’ ఇంకా ఏదో అనబోతుంటే..
నేనే ఆపేశాను. ‘‘ఇప్పుడేమీ వద్దు. కాఫీ తాగేవచ్చాం. మీరు మంచి పనిలో ఉన్నట్లున్నారు. నా మూలంగా మీ పని ఆపకండి. మీ పని మీరు పూర్తిచేయండి’’ అన్నాను.
‘‘్ఫరవాలేదు. మీరు కొంచెం టిఫిన్ తినండి. మధ్యాహ్నం లంచ్ ఏం తిన్నారో అంటూ లేవబోయింది.
నేను చెయ్యి పట్టుకు ఆపేశాను. ‘‘నిజంగా ఏం వద్దు. రాత్రి భోజనం చేస్తాము కదా! మధ్యాహ్నం అంతా బాగానే తిన్నాను’’ అన్నాను.
‘‘వౌళి మిచిగాన్ అంతా తిప్పేశాడా? టైర్డ్‌గా కనిపిస్తున్నారు’’ అంది.
‘‘అదేం లేదు. పైగా కారులో కూర్చోడం తప్ప నేనేమీ చేయలేదు. ఆ డ్రైవింగ్ ఏదో వౌళి చూసుకున్నాడు. ఇంకా టైర్డ్ అయ్యేందుకు ఏముంది. ఈ అమెరికా రోడ్లమీద ట్రావెల్ చేస్తే అలసిపోము’’ అన్నాను నవ్వుతూ! ‘‘మీరు పని చూసుకోండి. నేను లోపలకు వస్తాను’’ అంటూ లేచి నుంచున్నాను. వౌళి కూడా లేచి, మూర్తిగారి తమ్ముడితో బేస్‌మెంట్‌కి వెళ్లాడు. కిచెన్‌లో అడుగుపెట్టేటప్పటికి ఏడు ఎనిమిది మంది టేబుల్ దగ్గర స్టవ్ దగ్గర నుంచుని కనిపించారు. అందరూ కలిసి లడ్డూలు చేస్తున్నారు. ఇద్దరు వండుతుంటే నలుగురు లడ్డూలు చుడుతున్నారు. మరో ఇద్దరు సింక్ దగ్గర గినె్నలు కడిగేస్తున్నారు. చాలా అందమైన టీం వర్క్. సావిత్రి నన్ను, పేరు పేరున పరిచయం చేసింది. అక్కడ ఉన్నవాళ్ళంతా ఆ దేశంలో 2, 3 దశాబ్దాలుగా అక్కడ స్థిరపడిపోయినవాళ్ళే! కానీ ఎవ్వరిలో ఇసుమంత తెలుగుదనం కూడా తగ్గినట్లు లేదు.
చిత్రం మనవాళ్లు ఎవ్వరూ ఆచార వ్యవహారాలు మార్చుకోలేదు. కాస్తో కూస్తో మార్పు కనిపించేది మాత్రం వస్తధ్రారణలో మాత్రమే! అది కూడా సౌకర్యం కోసం అనుకుంటాను.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి