సబ్ ఫీచర్

పాఠశాలలు దత్తత! ఎన్నైరైల ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టిపెరిగిన ఊరు కన్నతల్లితో సమానం అంటారు. ఆలాంటి ఊరు తమకెంతో ఇచ్చింది. తిరిగి ఎంతోకొంత ఇచ్చి రుణం తీర్చుకోవాలనుకున్నారు ఈ ఎన్నైరైలు. విదేశాల్లో లక్షల్లో వచ్చే సంపాదనకు సార్థకత కల్పించేందుకు ఈ ఇద్దరు తమ ఊళ్లలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తతు తీసుకుని అభివృద్ధిచేస్తున్నారు. పొలిశెట్టి నరేష్, రావల అనిత ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడ్డారు. నరేష్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేశాడు. జర్మనీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అనిత ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకుంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఇద్దరికి సోషల్‌మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి భావాలు ఒక్కటే. సొంత ఊరు కోసం ఏదై నా చేయాలనే అభిలాష. ఇద్దరూ ఒక్కమాట మీద నిలిచి గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న తమ సొం తూర్లలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు.
సరైన వసతులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న విషయం తెలుసుకున్న వీరు తాము చదివిన పాఠశాలలను దత్తతు తీసుకుని వాటి అభివృద్ధికి నడుం బిగించారు. సమాజంలో గౌరవప్రదంగా జీవించాలంటే విద్య దోహదం చేస్తుంది. అందుకే స్కూలును దత్తతు తీసుకున్నానని నరేశ్ చెబుతున్నారు. అలాగే ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని నమ్మి న అనిత తన గ్రామంలోని పేద ఆడపిల్లలకు ప్రాధమిక విద్యనందించాలనే ధ్యేయంతోనే స్కూలును దత్తత తీసుకున్నట్లు చెబుతుంది.
పెరిగిన విద్యార్థుల సంఖ్య
వీరు పాఠశాలలను దత్తత తీసుకున్న తరువాత పదిమంది ఉండే విద్యార్థుల సంఖ్య నేడు 25కు పెరిగింది. పాఠశాలకు వచ్చే రోడ్లకు మరమ్మతులు చేశారు. స్కూలుకు రంగులు వేయటం, వసతులు కల్పించటం, పిల్లలకు బ్యాగ్స్, పుస్తకాలు, స్టేషనరీ అం దించటం, తాగునీటి వసతి కల్పించటం, వాట ర్ బాటిల్స్ సరఫరా చేయ టం, అలాగే విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, విశ్రాంతి గదులు ఏర్పాటుచేయటం వంటి సదుపాయాలు కల్పించారు. దీంతో గ్రామస్తులలో స్పందన వచ్చి పిల్లల్ని బడికి పంపుతున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 30కి పెరుగుతుందని భావిస్తున్నామని అనిత విశ్వాసం వ్యక్తం చేసిం ది. విదేశాల్లో ఉండటం వల్ల పాఠశాలల అభివృద్ధి పనులను పరిశీలింటం కొం త ఇబ్బందులెదురైనా వలంటీర్లే చూసుకుంటున్నారని, గ్రామస్తులు అనుమతిస్తున్నా స్కూలు ప్రధానోపాధ్యాయులు అనుమతి ఇవ్వకపోవటం వల్ల పేద పిల్లలను దత్తతు తీసుకుని చదివించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయని అనిత చెబుతుంది. మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇచ్చేందుకు వీరివురు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళా సాధికారిత సాధ్యమవుతుంది. తన గ్రామంలోని పేద ఆడపిల్లలకు ప్రాధమిక విద్యనందించాలనే ధ్యేయంతోనే స్కూలును దత్తత తీసుకున్నా.
- రావల అనిత

సమాజంలో గౌరవప్రదంగా జీవించాలంటే విద్య దోహదం చేస్తుంది. అందుకే స్కూలును దత్తతు తీసుకున్నా.
- నరేశ్