రుచి

పనస భలే పసందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనస తొనల రుచి అద్భుతం. ఈ కాలంలో దొరికే పండ్లలో పనస ఒకటి. తొనలు తినేసి గింజలను చాలామంది పారేస్తుంటారు. వీటితో కూడా రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. హల్వా, వడ, పాఠళీ, ఫ్రై, వంకాయ పనస గింజల కూర ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.

పనసగింజల ఫ్రై
పనస గింజలు - 2 కప్పులు, ఉల్లి ముక్కలు - 1 కప్పు, జీలకఱ్ఱ , కారం - 2 చెంచాలు, కరివేప - కొంచెం, పుట్నాలపొడి - 1/2 కప్పు, ఉప్పు -2 చెంచాలు, నూనె - 1/2 కప్పు, జీడిపప్పులు - 24
విధానము:ముందుగా గింజలు పైతొక్క తరిగి పచ్చిగింజల్ని ముక్కలుగా తరగాలి. నూనె కాగనిచ్చి ఈ ముక్కలు వేయించి డీప్‌లో పెట్టాలి. ఉల్లి ముక్కలు దోరగా వేయించి ప్రక్కన పెట్టాలి. ఇప్పుడు అదే నూనె మూకుడులో జీలకఱ్ఱ, కరివేప వేయించి పుట్నాలపొడి జల్లి ఉల్లిముక్కలు వేయించిన పనసగింజలు ముక్కలు చేర్చి కలిపి బాగా ఉడికాక దించండి.

పాటోళీ
పనసగింజలు - 24,ఉల్లి ముక్కలు -1 కప్పు,పచ్చిమిఠ్చి - 5,శెనగపప్పు - 1/2 కప్పు, ఉప్పు- 1 చెంచా, నూనె - 1/2 కప్పు, ఎండుమిర్చి - 4, జీలకఱ్ఱ -1 చెంచా, ఆవాలు -1 చెంచా, కొబ్బరి నూనె - 1/2 కప్పు, మినప్పప్పు - 4 చెంచాలు, కరివేప-కొంచెం, అల్లం కోరు -1 చెంచా
విధానం: పనసగింజలు ఉడికించి పై పొర విడదీసి మిక్సీ పట్టాలి. ఇది పొడి పొడిగా వస్తుంది. శెనగపప్పు నానబెట్టి ఉంచాలి. బాణలిలో నూనె వేసి పోపులు వేయించి కరివేప వేయించి శెనగపప్పు, కొబ్బరి వేసి కలిపి 10 నిముషాలు మూత పెట్టి దానిలో మిక్సీ పట్టిన పనసగింజల పొడి వేసి కలిపి అల్లం కోరు జల్లి కలిపి దింపాలి. ఇది అన్నం, దోశె దేనికైనా బాగుంటుంది.ముఖం మెరవాలంటే..
ముఖం జిడ్డుగారుతూ.. మురికిగా ఉంటుంటే వంటింట్లో దొరికే వస్తువులతోనే తాజాగా ఉంచుకోవచ్చు. ముఖం మెరిసేలా ఉండేందుకు టొమాటో గుజ్జు చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది. దీనిని ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే మురికి పోవటంతో పాటు మంచి మెరుపు కనిపిస్తోంది. అలాగే కీరదోస రసానికి గ్లిజరిన్, గులాబీ నీరు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, రాత్రి నిద్ర పోవటానికి ముందు రాసుకోవాలి. ఇలా కొన్ని రోజులు పాటు చేస్తే మురికి పోవటమే కాదు చర్మం రంగు మెరుగవుతుంది కూడా. చిటికెడు పసుపూ, ఒక స్పూను పాల పొడి, రెండు చెంచాల తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరిపోయాక కడిగేసుకోవాలి. ఒట్స్‌ని పొడి చేసుకుని అందులో కొంచెం మజ్జిగ వేసుకుని, మురికి పేరుకున్న చోట ఆ మిశ్రమంతో బాగా రుద్దితే మురికి వదిలిపోతుంది. మురికిని పోగొట్టుకోవడానికి మరో సులువైన పద్ధతి కొబ్బరి నీళ్లతో శుభ్రం చేసుకోవడం, ముఖాన్నీ, చేతుల్నీ, కొబ్బరి నీళ్లతో కడుక్కుంటే నలుపుదనం పోతుంది. చర్మం మృధువుగా మారుతుంది.

వడలు
పనసగింజలు - 28, బంగాళాదుంపలు - 2, అల్లం - చిన్న ముక్క, మిర్చి - 5, జీలకఱ్ఱ - 1 చెంచా, శెనగపిండి - 1/2 కప్పు, నూనె - 250 గ్రా., కార్న్‌ఫ్లోర్ - 1/2 కప్పు, బియ్యం పిండి - 1/2 కప్పు, ఉప్పు - 1 చెంచా
విధానం: ముందుగా పనస గింజలు నీటిలో నానబెట్టి పొర వలచి మిక్సీ పట్టాలి. ఇది కోరు ముదిరి వస్తుంది. దీనిలో బంగాళా దుంప ఉడికించిన ముద్ద అల్లం మిర్చి జీలకఱ్ఱ శెనగపిండి చేర్చి మరోసారి మిక్సీ పట్టాలి. ఇపుడు కార్న్‌ఫ్లోర్ నీళ్ళల్లో కలిపి చిక్కని ద్రవంగా చేసుకోవాలి. నూనె కాగాక పై పిండి వడలుగా తట్టి కార్న్‌ఫ్లోర్ ద్రవంలో ముంచి నూనెలో వదలాలి. ఈ తరహాగా అన్నీ వడలు చేసుకోవాలి.

వంకాయతో కూర
టమోటా సాస్ - 2 చెంచాలు, జీడిపప్పు పేస్ట్ - 5 చెంచాలు, వంకాయ ముక్కలు - 2 కప్పులు, పనసగింజలు తరిగిన ముక్కలు -2 కప్పులు, మసాలా కారం - 4 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు, నూనె - 1/4కప్పు, ఉప్పు - 1 చెంచా, శెనగపప్పు - 2 చెంచాలు, కొబ్బరి కోరు - 2 చెంచాలు, పచ్చిమిర్చి - 6, మీగడ - 1 కప్పు విధానం: ముందుగా బాణలిలో నూనె వేగాక శనగపప్పు, పచ్చిమిర్చి వేయించి కొబ్బరి వేయించి ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపి అందులో వంకాయ ముక్కలు, పనసగింజలు చేర్చి 2 కప్పుల నీరు చేర్చాలి. ఇది మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. మీగడ, టమోటా సాస్, జీడిపప్పు పేస్ట్ వేసి కలిపి దింపాలి.

హల్వా
పనస గింజలు - 2 కప్పులు, కొబ్బరి కోరు - 1 కప్పు, బెల్లం కోరు - 2 కప్పులు
నెయ్యి - 1/2 కప్పు, శెనగపిండి - 1 కప్పు, ఏలకులు - 6, జీడిపప్పులు - 24
పాలు - 1 కప్పు, బాదంపప్పు - 2 చెంచాలు
విధానం:ముందుగా నెయ్యి బాణలిలో వేసి పనసగింజలు కోరు, కొబ్బరి కోరు వేసి దోరగా వేయించాలి. ఇది బాగా వేగాక దీనిలో శెనగపిండి చేర్చి వేపాలి. ఇప్పు డు దానిలో పాలు పోసి ఒక కప్పు నీరు పోసి ఉడకనివ్వాలి. ఇవి ఉడికాక బెల్లం చేర్చి పాకం రానివ్వాలి. గినె్ననుంచి మిశ్రమం విడిపోతుండగా, ఏలకుల పొడి వేయించిన జీడిపప్పులు, బాదం పప్పులు చేర్చి కలిపి దింపి పళ్ళానికి నెయ్యి రాసి మిశ్రమం పొయ్యాలి. ఆరాక నచ్చిన ఆకృతిలో ముక్కలు చేసుకోవాలి.

- వాణీ ప్రభాకరి