కర్నూల్

సమస్తం నంద్యాల వైపే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 20:జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం యావత్తు జిల్లా అధికార యంత్రాంగాన్ని నంద్యాల నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి వినియోగిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ పని చేస్తూ నియోజకవర్గంలో ప్రజల వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక సమస్యలపై దృష్టి సారించింది. వీటిని పరిష్కరించడం ద్వారా ఓటర్ల మన్ననలు పొంది గెలుపొందాలని పార్టీ భావిస్తోంది. దీంతో నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు ఎలాంటివైనా అధికారులు పరిశీలించి జాప్యం చేయకుండా పరిష్కరించాలని, పరిష్కారానికి వీలు కాని సమస్యలపై రాత పూర్వక సమాధానం పంపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో ఎంతో కాలంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుత ఎన్నికల సందర్భంగా పింఛన్లు మంజూరు చేశారు. అర్హత ఉండి పింఛను లేని వారి నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సుమారు 99శాతం దరఖాస్తులకు పరిష్కారం చూపినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక పక్కా గృహాల విషయంలో కూడా ఇల్లు లేని వారందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో నిర్మిస్తున్న గృహ సముదాయంలో కేటాయిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు ఈ నెల 22వ తేదీ ప్రారంభమై సరిగ్గా 15 మాసాల్లో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 13,500 పక్కా గృహాలు జీ+3 విధానంలో నిర్మించనుండగా మరో 2,500 పక్కా గృహాలు అక్రమంగా పొందిన వారి నుంచి స్వాధీనం చేసుకుని అర్హులకు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెద్ద కాలనీలుగా తయారైన వైఎస్ నగర్, ఎస్సార్బీసి కాలనీల మధ్య నిర్మిస్తున్న బహుళ అంతస్థుల గృహ సముదాయంలో ఇంటిని పొందుతుండటంతో నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కోసం ఇచ్చే సబ్సిడీ రుణాలు, పొదుపు మహిళలకు బ్యాంకర్ల ద్వారా రుణాల మంజూరు, రైతులకు సంబంధించి పంట రుణాల మంజూరుకు ఉన్నతస్థాయి అధికారులు బ్యాంకర్లతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీని కారణంగా అనేక మందికి లబ్ధి చేకూరిందని సమాచారం. ఇక నంద్యాల పట్టణంలో ఎంతో కాలంగా ప్రజలు కోరుతున్న రహదారుల విస్తరణ పనులను ప్రారంభించారు. మొదటి దశలో బస్టాండ్ రోడ్డులోని సంజీవనగర్ గేటు నుంచి శ్రీనివాసనగర్ జంక్షన్ వరకూ అక్కడి నుంచి నూనెపల్లె, కల్పన సెంటర్ వైపు రహదారిని విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వీధుల వెంట ఉన్న సుమారు 350 మందికి చెందిన భవనాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. పట్టణంలో తాగునీటి కుళాయి కనెక్షన్ లేని వారికి తక్షణం కుళాయి ఏర్పాటు చేస్తుండగా సిమెంటు రహదారులు లేని కాలనీల్లో వాటిని నిర్మించడానికి సిద్ధపడుతున్నారు. కాగా ఈ నెల 25వ తేదీ నోటిఫికేషన్ జారీ కానుందన్న సమాచారం మేరకు 24వ తేదీ లోపే సిమెంటు రహదారుల నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. మొత్తం మీద నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభించడంపై ప్రజలు హర్షిస్తున్నా ఓటు ఎవరికి వేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.