కర్నూల్

రేపు నంద్యాలలో సిఎం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, జూలై 20:సిఎం చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తారని, అధికారులు అందరూ సమన్వయంతో కలిసి పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సిఎం పర్యటన ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ, జెసి ప్రసన్నవెంకటేష్, జెసి-2 రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఈ నెల 22వ తేదీ సిఎం చంద్రబాబు వస్తున్నారన్నారు. ఈ నేపథ్యం లో అధికారులకు అప్పగించిన పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నా రు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీనివాసురెడ్డిని ఆదేశించారు. హెలిప్యాడ్ మైదానం నుంచి చామకాల్వ, కుందూనదుల రిగ్రేడేషన్ల పనులను సిఎం తనిఖీ చేయనున్నందున తగిన చర్యలు తీసుకోవాలని జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌ను ఆదేశించారు. ఎస్‌ఆర్‌బిసి కాలనీలో అపిట్‌డికో సంస్థ చేపడుతున్న హౌసింగ్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారని ఆయా ప్రదేశాల్లో జంగిల్ క్లియరెన్స్ చేసి తగిన ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ పనులు, మార్కెట్ యార్డులో స్వయం సహాయక బృందాలతో ముఖాముఖి, ఎస్‌ఆర్‌బిసి కాలనీలో హౌసింగ్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమాల్లో సిఎం పాల్గొంటారన్నారు. ఆయా ఏర్పాట్లకు సంబంధించిన అధికారులు డిఆర్‌డిఎ, మెప్పా పిడిలు రామకృష్ణ, రామాంజనేయులు, జడ్పీ సిఇఓ ఈశ్వర్ వీటిపై నివేదిక ఇవ్వాలన్నారు. సిం పర్యటన కాన్వాయ్‌కు కండీషన్‌లో ఉన్న వాహనాలను పంపాలని డిటిసిని ఆదేశించారు.
ఇక జిల్లాలో మూడేళ్లలో సాధించిన ప్రగతిపై నియోజకవర్గంలోని మండలాల వారీగా నివేదికలు సిపిఓకు అందజేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎస్పీజి మైదానంలో వ్యవసాయ అనుబందశాఖ, హౌసింగ్, తదితర 13 శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆయా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఏపిఎంఐపి పిడి శ్రీనివాస్‌ను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ హెలిప్యాడ్ నుంచి సిఎం పర్యటించే ప్రదేశాల్లో సెక్యూరిటీ నిబంధనల ప్రకారం బారీకేడింగ్ పనులు చేపడుతామన్నారు. సిఎం పాల్గొనే కార్యక్రమాల్లో విఐపిలకు, ఇతర అధికారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని వీటిని వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. సిఎం వచ్చే సమయానికి 3 గంట ముందే సంబంధిత ప్రదేశాలను సెక్యురిటీ సిబ్బందికి అప్పగించాల్సి ఉంటుందని ఆదిశగా పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. సిఎం సందర్శించే స్టాల్స్‌లో సిబ్బంది వివరాలు, లబ్ధిదారుల జాబితాను తమకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే వారి జాబితాను అందిస్తూ వారందరికీ గుర్తింపుకార్డులు అందజేయాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో కర్నూలు, నంద్యాల ఆర్డీఓలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.