వరంగల్

విద్యార్థులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, జులై 20: మండలంలోని మేడిపల్లి ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో గురువారం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం తిన్న అల్పాహారం కలుషితం కావడం వల్లే అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. కాగా అస్వస్థతకు గురైనవారిని కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా వైద్యాధికారి ఉమాదేవి పేర్కొన్నారు. కాగా విషయం తెలుసుకున్న కాటారం టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సంతోషం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని బృందం మేడిపల్లి ఎస్టీ ఆశ్రమ పాఠశాలను సందర్శించింది. పాఠశాలలో వంట గది, బాతురూమ్‌లు, లావెట్రీన్‌లు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. స్వచ్చ భారత్ కార్యక్రమాలు చేపట్టడం లేదని వారు విమర్శించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వారు పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. టిఆర్‌ఎస్ మండల కమిటీ ప్రధాన కార్యదర్శి భూపెల్లి రాజు, ఉపాధ్యక్షుడు కొట్టె శ్రీహరి, ఎంపిటిసి కుమ్మరి అశోక్, రాంబాబు, అశోక్, శేఖర్, అలీం, రాజేశ్, బాయగాని రాజు, తదితరులు పాల్గొన్నారు.
అటవీ భూములను కాపాడాలి
మహబూబాబాద్, జూలై 20: అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ ఛీఫ్ కన్జర్ వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సిసిఎఫ్) సునీల్‌కుమార్ గుప్తా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనాను కోరారు. గురువారం మధ్యాహాన్నం ఆయన కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్‌తో సమావేశమై జిల్లాలో అటవీ భూముల పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. అడవులలో చెట్లను నరకకుండా తగు చర్యలు చెపట్టాలని కోరారు. అన్యాక్రాంతం అయిన అటవీభూములను స్వాధీనం చేసుకొని హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని తెలిపారు. అడవులను దట్టమైన అడవులుగా మార్చుటకు కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం అటవీశాఖ అధికారులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అటవీ భూముల్లో ఎన్‌ఆర్‌ఈజిఎస్ కింద బ్లాక్ ప్లాంటేషన్ చేయుటకు సహకరించాలని కలెక్టర్‌ను కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ.. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు చెపట్టాలని, 2005సంవత్సరం తర్వాత పోడు వ్యవసాయానికి అనుమతించడం లేదని చెప్పారు. జిల్లాలో దాదాపు 30హెక్టార్ల అటవీ భూముల్లో హరితహారంలో మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన వివిధ పథకాల ద్వారా పోడు వ్యవసాయం మానిన వారికి ప్రత్యామ్నయ ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జెసి దామోదర్‌రెడ్డి, డిఎఫ్‌ఓ కృష్ణాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.