వరంగల్

‘లోవోల్టేజ్ సమస్యను పరిష్కరిస్తాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లబెల్లి, జూలై 20: తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సమస్యల పరిష్కారంతో పాటు లోవోల్టేజ్ సమస్యల నుంచి విముక్తి కల్పించడం కోసం సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరగుతుందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండలంలోని నందిగామాలో 33కెవి సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతులు, గృహ వినియోగదారులు లో వోల్టేజ్ సమస్యతో సతమతమవుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లోవోల్టేజ్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు మండలంలోని ఆరు సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగానే నందిగామలో నూతన సబ్ స్టేషన్ కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కెసి ఆర్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడడమే కాక ఎలాంటి ప్రభుత్వం అందించే ఎకరాకు 4వేలు రూపాయలను అందించే పథకం కూడ ప్రతి రైతుకు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పిన రైతుల కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.కార్యక్రమంలో జడ్పివైస్ చైర్మన్ మురళిధర్, ఎంపిపి సారంగపాణి, సర్పంచ్ సుమన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మురళిధర్, ట్రాన్స్‌కో అధికారులు, రైతులు పాల్గొన్నారు.