నిజామాబాద్

గ్రామాభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌గల్, జూలై 20: భీమ్‌గల్ మండలం బెజ్జోరా గ్రామం తన సొంత గ్రామంగా భావిస్తూ, ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చేందుకు కృషి చేస్తానని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బెజ్జోరా గ్రామ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన మూడెళ్ల కళావతి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడెడ్ల కళావతితో ఎంపిడిఓ లింగంనాయక్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు మెచ్చేలా పాలనా అందించాలని, అప్పుడే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతామని అన్నారు. గతంలో బెజ్జోరా గ్రామాభివృద్ధికి అనేక నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మూడెళ్ల కళావతిని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడు లేని విధంగా సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెడుతూ అమలు చేస్తున్నారని అన్నారు. దీంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో చీకటిని పారద్రోలి, వెలుగులు నింపేందుకు సిఎం కెసిఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రికి ప్రజలంతా అండగా నిలువాలని ఆయన కోరారు. భీమ్‌గల్ మండలానికి సాగునీరు అందించేడమే తన ఆశయమని, అందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సాగునీరు తీసుకరావడం జరుగుతుందన్నారు. సిఎం కెసిఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, వారిని చైతన్యపర్చేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. బెజ్జోరా గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకరావాలని సర్పంచ్‌కు సూచించారు. అనంతరం గ్రామంలోని రాయుడు కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే, అక్కడ నెలకొని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇద్దరు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. నూతనంగా ఎన్నికైన మూడెడ్ల కళావతి, ప్రకాష్‌లను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ ఎంపిపి కొండ గోదావరి, కమ్మర్‌పల్లి ఎఎంసి చైర్మన్ దొన్కంటి నర్సయ్య, తహశీల్దార్ బావయ్య, ఇఒపిఆర్‌డి చారి, సర్పంచ్‌లు దేవేందర్‌గౌడ్, రాజమల్లు, కొమ్ము నరేష్, ఆర్మూర్ మహేష్, గ్రామ కార్యదర్శి నర్సయ్యతో పాటు వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.