నిజామాబాద్

రాష్టప్రతిగా కోవింద్ ఎన్నిక పట్ల సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జూలై 20: భారతదేశ 14వ రాష్టప్రతగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి నాయకులు ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్, బిజెపి పట్టణ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్, ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజు, పూజ నరేందర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఆకుల శ్రీనివాస్, నాయకులు బ్రాహ్మణ్‌పల్లి లింగన్న, బొట్ల విజయ్, మందుల వీరబద్రీ, పోల్కం వేణు, పుప్పాల సతీష్, పాల భాస్కర్, మందుల బాలకృష్ణ, కోలు చంద్రశేఖర్, కలిగోట ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో బిజెపి సంబరాలు
కామారెడ్డి రూరల్: జిల్లా కేంద్రంలో బిజెపి నాయకులు కార్యాలయంలో గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ అభివృద్ది కమిటి చైర్మన్ మురళీదర్‌గౌడ్ మాట్లాడుతూ, మన దేశానికి 14వ రాష్టప్రతిగా రామ్‌నాథ్ కోవింద్ గెలుపొందారని అన్నారు. బిజెపి బలపర్చిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉండేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరాకుమారిని నిలబెట్టి కనీసం 40 శాతం ఒట్లు రాలేవని అన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్తారని చెప్పారు. అనంతరం బిజెపి నాయకులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఇట్టం సిద్దిరాములు, జిల్లా ఉపాద్యక్షులు పెర రమేశ్, జిల్లా ప్రదాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, బిజెవైఎం జిల్లా అధ్యక్షులు చింతల రమేశ్, పట్టణ అధ్యక్షులు తేలు శ్రీను, అసెంబ్లి కన్వీనర్ పుల్లూరి సతీష్, జూలూరి సుదాకర్, దువ్వల రమేశ్, మల్లేశ్, సతీష్,శ్యాంరావ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.