అదిలాబాద్

భావితరాలకు హరితఫలాలను అందిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూలై 20: ఇప్పుడు మనం నాటే మొక్కలు రాబోయే భవిష్యత్ తరాలకు వెలకట్టలేని ప్రయోజనాలను అందిస్తాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం బాసర క్షేత్రంలో మూడవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా గోదావరి వద్ద రోడ్డు డివైడర్లలో మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి కోరారు. అంతకుముందు బాసర ఆలయంలోని వసతిగృహంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా నేటి వరకు 6 కోట్ల 84 లక్షల మొక్కలు నాటమని తెలిపారు. మూడవ విడత హరితహారంలో 40కోట్ల మొక్కలను లక్ష్యం పెట్టుకోవడం జరిగిందని ప్రతీ గ్రామాల్లో 40వేల మొక్కలు, నియోజకవర్గస్థాయిలో 40లక్షల మొక్కలు రాష్టవ్య్రాప్తంగా 40కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వివరించారు. మానవ మనుగడకు చెట్లు ప్రాణవాయువుగా నిలుస్తున్నాయని, ప్రతిఒక్కరు నాలుగు మొక్కలు నాటాలని సూచించారు. అటవీ సంపదను 23శాతం నుండి 33శాతానికి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. కేసిఆర్ మానస పుత్రికగా హరితహారాన్ని కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.