అదిలాబాద్

నాటిన మొక్కలను బిడ్డల్లా కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 20: పర్యావరణం లోపించడం కారణంగా కరవు దుర్బిక్షం తలెత్తుతోందని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బిడ్డల్లా సంరక్షించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మావలలో వినూత్నంగా ఏర్పాటు చేసిన రాశివనం కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు తమ రాశీని బట్టి స్వచ్చందంగా మొక్కలు నాటారు. అనంతరం మంత్రి జోగురామన్న, బెవరేజ్ కార్పోరేషన్ చైర్మన్ దేవిప్రసాద్‌తో కలిసి బ్రహ్మణవాడ రామాలయం, ఐటి ఐ కళాశాలలో మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను బిడ్డల్లా కాపాడుతూ పెంచాలని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, యువతీ యువకులు ప్రతి ఒక్కరు హరిత ఉద్యమంలో పాల్గొని 24శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మూడో విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 6.84 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటడం జరిగిందన్నారు. ఖాళీ ప్రదేశాల్లో సీడ్‌బాల్స్ ద్వారా పెద్దఎత్తున మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. నేటి మొక్కలే రేపటి వృక్షాలుగా మారి పర్యావరణ పరిరక్షణతో పాటు సరైన సమయంలో వర్షాలు కురిపిస్తాయన్నారు. ఈ సంవత్సరంలో 40 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం కాగా 20 కోట్ల మొక్కలు అటవీ ప్రాంతాలలో నాటడం జరుగుతుందన్నారు. బోడగుట్టల ప్రాంతాలలో రావి, జువ్వి వంటి మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. కెనడా, జపాన్ వంటి దేశాల్లో మొక్కలు ఎక్కువ మొత్తంలో నాటడం జరిగిందని, భారత దేశంలో సగటున 28 మొక్కలు మాత్రమే ఉన్నాయన్నారు. బెవరేజ్ కార్పోరేషన్ చైర్మెన్ దేవిప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత స్వచ్చందంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాద్యతలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, ఫారెస్ట్ కన్సర్వేటర్ సంజయ్‌కుమార్ గుప్తా, డిఎఫ్‌వో కొండల్‌రావు, ఆర్డీవో సూర్యనారాయణ, జడ్పీటీసీ ఆశోక్, మావల సర్పంచ్ రఘుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్లు ఆరె రాజన్న, ఆడె శీల, మండల ఉప్యాక్షులు గంగారెడ్డి, కౌన్సిలర్లు, మహిళలు, ఎఫ్‌ఆర్‌వో ప్రవీణ్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.