విజయనగరం

రాష్ట్రంలో 4 లక్షల గృహ నిర్మాణాలు చేపడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామి, జూలై 20: రాష్ట్రంలో 4 లక్షల ఇళ్లు నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర గృహనిర్మాణాశాఖ ఎండి కాంతిలాల్ దండే అన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈమేరకు గృహ నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గురువారం అలమండ లో నిర్మించిన ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేల ద్వారా గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. జూలై నెలాఖరు కల్లా ఎంపిక పూర్తిచేస్తామని అన్నారు. 2016-17 సంవత్సరంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాల కింద 2లక్షల 90 వేలు ఇళ్లు మంజూరు కాగా, వీటిలో ఒకలక్షా95వేలు ఇళ్ల నిర్మాణాలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో పల్స్ సర్వే ప్రకారం 30 లక్షల మందికి ఇళ్లు అవసరమని గుర్తించారు. ఈ నివేదికను కేంద్రానికి సమర్పించామన్నారు. అలమండలో హుదూద్ తుపాన్ కింద నిర్మించిన 160 ఇళ్లనిర్మాణాన్ని కాంతిలాల్ దండే పరిశీలించారు. ప్రతి ఇంటిలో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అన్న విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఇళ్లకు వంటగదుల నిర్మాణాలు కొద్దిగా మార్పులు చేయాలన్నారు. ఈ సందర్భంగా కాంతిలాల్ దండేను కలసి నియోజకవర్గంలో కావాల్సిన ఇళ్ల మంజూరు విషయమై ఎమ్మెల్యే కోళ్లలలితకుమారి విన్నవించారు. ఇళ్ల నిర్మాణాలపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ శాఖ ఎస్‌ఇ శ్రీరాములు, ఇఇ తారాచంద్, డిఇ శంకరరావు, ఎఇ చినబాబు, టిడిపి నాయకులు లగుడు సింహాద్రి, సర్పంచ్ లగుడు వెంకటరావు, అధికారులు పాల్గొన్నారు.