శ్రీకాకుళం

పొలిటికల్ ఫండ్‌కు..పొగపెట్టిన జిఎస్టీ!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 20: రాజకీయ పార్టీలు..ఎన్నికల ఖర్చులు..పార్టీ కార్యకలాపాలు..సభలు, సమావేశాలు..ఇలా అధికారంలో వున్నవారికైనా, ప్రధాన ప్రతిపక్షమైనా - ఆర్థికంగా సహాయం కావాలంటే సిక్కోల్ గడ్డపై కన్పించేవి రెండే మార్గాలు ఒకటి గ్రానైట్ పరిశ్రమ. రెండోది మద్యం సిండికేట్. ఇప్పుడు ఈ రెండు మార్గాలు రానున్న కాలంలో పొలిటికల్ ‘్ఫండ్’కి సహాయనిధి ఇచ్చేందుకు ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జిఎస్టీ గ్రానైట్ పరిశ్రమకు తాళాలు వేయించేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీతో ‘బెల్టు’తీసి ఆదాయవనరులను కట్ చేసేసింది. దీంతో జిల్లా పొలిటికల్ సహాయనిధి ఇవ్వలేమంటూ ఆయా వ్యాపారవేత్తలు తెగేసి చెప్పేస్తున్నారు. ప్రతీ ఏటా అధికారంలో ఉన్న పార్టీ నడిపేందుకు అయ్యే ఖర్చుతోపాటు ఎన్నికల సమయంలో సహాయం చేసే దానకర్ణులు కూడా ఈసారి కొరతనే చెప్పకతప్పదు. ఇందుకు కొన్ని కారణాలు గమనిస్తే...
వస్తుసేవల పన్ను అమల్లోకి రాకముందే సిక్కోల్ గ్రానైట్ పరిశ్రమ నుంచి ఆర్డర్లు చేసిన బ్లాకులను బయ్యర్లు తీసుకోకుండా వదిలేసారు..క్వారీలు, కటింగ్, పాలిషింగ్ కార్ఖానాలకు తాళాలు పడుతున్నాయి. కేవలం రెండు వారాల సమయానికే సుమారు 54 కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లు మూతపడ్డాయి. ఇప్పటికే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లను మూసివేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగానే శ్రీకాకుళం గ్రానైట్ పరిశ్రమపై జిఎస్టీ ప్రభావితం చేయడంతో కుదేలైపోయింది. గ్రానైట్ క్వారీలపై వస్తుసేవల పన్ను చాలా ప్రభావితం చేస్తోంది. గ్రానైట్ క్వారీల వద్ద 12 శాతం జీఎస్టీ చెల్లించి బ్లాకులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటే - కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ల వద్ద 28 శాతం అత్యధికంగా జిఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. దీంతో గ్రానైట్ శ్లాబ్, మొర్నమెంటు మెటీరియల్ కొనుగోలు సమయంలో వినియోగదారునిపై మరింత భారం పడుతుంది. 28 శాతం జిఎస్టీని నుంచి 15 శాతానికి తగ్గించాలని గ్రానైట్ క్వారీ, కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమల యాజమాన్యాలు, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు సమర్పించినా ఫలితం లేకపోవడంతో గత రెండువారాలుగా వరుసగా గ్రానైట్ పరిశ్రమలకు యాజమాన్యాలు తాళాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిషా ప్రాంతంలో క్వారీ, కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ల యజమానులు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి రాళ్ళ కొండలకు గనులశాఖ నుంచి అనుమతులు పొంది ప్రభుత్వానికి రుసుం చెల్లిస్తే - ఇప్పుడు జిఎస్టీ రూపంలో ఆ కొండలన్నీ పిండి చేసినా వారి పెట్టుబడులు వెనక్కి వచ్చే పరిస్థితులు కన్పించడం లేదంటూ గోడుపెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వెయ్యి క్యూబిక్ మీటర్లు శ్లాబ్ మెటీరియల్‌గా, రెండు వేల క్యూబిక్ మీటర్లు గ్రానైట్ బ్లాకులుగా ఎగుమతి అవుతుంటాయి. నెలకు ఒక్కో గ్రానైట్ క్వారీల్లో 700 మీటర్లు మార్క్ చేసే కంపెనీ సైతం ఇప్పుడు 70 క్యూబిక్ మీటర్లు కూడా ఎగుమతులు చేయలేని పరిస్థితికి గ్రానైట్ వ్యాపారం దిగజారిపోయింది. మరోవైపు జిఎస్టీ ప్రభావంతో క్వారీలు నిర్వహణకు సైతం యాజమాన్యాలు అధిక వడ్డీలకు ప్రైవేటు సంస్థల నుంచి అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎదురయ్యింది. సిక్కోల్ ప్రాంతం నుంచి నీలిరంగు గ్రానైట్ శ్లాబ్ మెటీరియల్ ఎక్కువ శాతం కేరళకు ఎగుమతి అవుతుండడంతో తాజాగా పెంచిన జిఎస్టీతో అక్కడ బయ్యర్లు కూడా అడ్వాన్సులు ఇచ్చి ఆ బ్లాకులను తీసుకువెళ్ళేందుకు ముందుకురావడం లేదు. జిఎస్టీ అమలై రెండు వారాలయ్యేనాటికే శ్రీకాకుళం గ్రానైట్ పరిశ్రమ కుదేలైపోయింది.
జిల్లా అంతటా 110 గ్రానైట్ లీజులుగా క్వారీ పరిశ్రమలకు గనులశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ గ్రానైట్ ఖనిజసంపద అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, డిమాండ్ ఉండడంతో ఇటలీ, స్పైన్, జర్మనీ దేశాలకు డిమాండ్ ఉండడంతో ఎగుమతులు జరుగుతున్నాయి. దీనివల్ల విదేశీ మారకద్రవ్యంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సిక్కోల్ గ్రానైట్ పరిశ్రమ నుంచి కోట్లాది రూపాయలు సీనరేజ్ రూపంలో ఖజానాకు జమవుతుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ త్రైమాసికానికి రూ. 13.65 కోట్ల రూపాయలు సర్కార్‌కు గ్రానైట్ పరిశ్రమల నుంచి ఆదాయం లభించేది. ఇప్పుడు ఆటువంటి ఆదాయం కల్పించే గ్రానైట్‌కు జిఎస్టీ ప్రభావం చాలా ఎక్కువుగా భారం కావడంతో తాజా పరిస్థితులు సిక్కోల్ గ్రానైట్ నుంచి సర్కార్‌కు సీనరేజ్ రూపేణా ఖజానాకు జమయ్యే పరిస్థితులు కన్పించడం లేదు. దీంతో ఆ పరిశ్రమ యజమానులు పొలిటికల్ కలెక్షన్లు ఇవ్వలేని పరిస్థితులకు దిగజారారు. దీంతోపాటు మద్యం సిండికేట్ కూడా ‘బెల్టు’ ఆదాయం లేకపోవడంతో ఎన్నికల నిధికి సహాయం చేయలేమంటూ తెగేసి ఆయా ప్రజాప్రతినిధుల వద్ద గోడు పెడువినిపిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.