ఖమ్మం

వరద గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూలై 20: భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృత రూపం దాల్చింది. ఉన్నట్టుండి ఒకేసారి 15 అడుగుల మేర పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో ఒక్కసారిగా బుధవారం పెరిగిన గోదావరి సాయంత్రానికి తగ్గుముఖం పట్టగా గురువారం ఉదయానికి అనూహ్యంగా పెరిగింది. ఎగువున ఉన్న ఇంద్రావతి, ప్రాణహిత, తాలిపేరు నదులు ఉప్పొంగడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృత రూపం దాల్చింది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో 21.7 అడుగుల మేర ఉన్న గోదావరి తగ్గుముఖం పడుతుందని భావించారు. కానీ గురువారం రాత్రికి రాత్రి 15 అడుగుల మేర గోదావరి ఒక్కసారిగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో 37 అడుగులకు చేరిన గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు స్వల్పంగా కురుస్తుండటం, నదుల నుంచి నీరు విడుదల కావడంతో భద్రాచలం వద్ద గంటగంటకు వరద ఉద్ధృతి పెరుగుతోందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో శివనారాయణరెడ్డి సూచించారు. గురువారం ఆయన భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. కరకట్ట స్లూయిజ్‌లను పరిశీలించి లీకులు కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గోదావరికి కొత్తనీరు చేరుకోడంతో పర్ణశాల నారచీరల ప్రదేశం వరద నీటిలో మునిగిపోయింది. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి (43 అడుగులు) చేరుకునే అవకాశం ఉందని సీడబ్య్లూసీ అధికారులు తెలిపారు. గంటగంటకు రెండు అంగుళాల మేర గోదావరి పెరుగుతుండటంతో సెక్టోరియల్ అధికారులు రంగంలోకి దిగారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే నిత్యావసరాలు (బఫర్‌స్టాక్) సిద్ధంగా ఉంచారు. రాజమండ్రి నుంచి మరో రెండు లాంచీలను తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయానికి 40 అడుగులకు నీటిమట్టం చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కాస్త నెమ్మదించడంతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వచ్చి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు. వరద ఉద్ధృతి ఎలా ఉన్నా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. గోదావరికి వరద వస్తే శబరి నది పోటెత్తే ప్రమాదం ఉండటంతో తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఐటీడీఏ పీవో చిట్టిబాబు భద్రాచలం వచ్చి గోదావరి వరద ఉద్ధృతి పరిశీలించారు. భద్రాచలం వద్ద గోదావరి పెరిగితే చింతూరు ఐటీడీఏ పరిధిలో పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ఆయన వచ్చారు. భద్రాచలం ఎఎస్పీ సునీల్‌దత్ గోదావరి వరద ఉద్ధృతి పరిశీలించి నదిలోకి వెళ్లవద్దని సూచించారు. వరద ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.