ఖమ్మం

గట్టాయిగూడెంలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, జులై 20: పాల్వంచలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి 24 గంటలు గడవక ముందే గట్టాయిగూడెంలోని ఒక ఇంట్లో గురువారం చోరీ జరిగింది. ఈ చోరీ పాల్వంచ పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బాధితురాలి వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని గట్టాయిగూడెంకు చెందిన దేవబత్తిని విజయ కొత్తగూడెంలోని బాబు క్యాంపులో గల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే గురువారం విజయ ఇంటికి తాళం వేసి పాఠశాలకు వెళ్లారు. అదను కోసం ఎదురుచూస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు విజయ పాఠశాలకు వెళ్లగానే ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న సుమారు లక్ష రూపాయల నగదు 40 తులాల బంగారం వస్తువులను అపహరించారు. విజయ ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు ఇంటి వద్దకు వెళ్లి చూడగా ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించారు. దొంగతనం జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత పాఠశాలలో ఉన్న విజయకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విజయ ఇంటికి వచ్చి చూడగా బీరువా పగలగొట్టి ఉండడం, అందులో ఉన్న సొమ్ము, బంగారు వస్తువులు కనబడకపోవటంతో పోలీసులను ఆశ్రయించింది. పట్టణ పోలీసులు దొంగతనం జరిగిన ఇంటికి డాగ్ స్క్వాడ్‌తో వెల్లి పరిశీలించారు. విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.