ఖమ్మం

జివో 171తో తీరనున్న గూడెం ప్రజల చిరకాల కోరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 20: పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణ ప్రజల చిరకాల కోరిక త్వరలోనే తీరనుంది. స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన 171 జివో ప్రకారం వంద గజాలలోపు స్థలం ఉన్న లబ్ధిదారులకు త్వరలోనే పట్టాలు అందనున్నాయి. ఈ నెల 19వ తేదీన విడుదలైన 171 జివో ప్రకారం ప్రజలకు పట్టాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు చర్యలను వేగవంతం చేయనున్నారు. కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకటరావు ప్రత్యేక శ్రద్ధతో నూతన జివో ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పట్టాల పంపిణీ నూతన జివో విడుదలతో కానున్నాయి. స్థలాల క్రమబద్ధీకరణ కోసం మూడేళ్లుగా జరుగుతున్న పోరాటాలకు బ్రేకులు పడటంతోపాటు ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. 2005లో స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 373 జివో విడుదల చేసింది. దీని ప్రకారం 2014 వరకు సుమారు 12 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, 4600 దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ పట్టాలను అప్పట్లో పంపిణీ చేశారు. మిగిలిన దరఖాస్తుదారులు మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా, పలు రాజకీయ పార్టీలు పట్టాల పంపిణీ కార్యక్రమం కోసం ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. స్థలాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించిన కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకటరావు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నూతన జివో విడుదల చేయించటం ద్వారా కొత్తగూడెం పట్టణ ప్రజల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల ప్రక్రియ ప్రారంభం కానుంది. లబ్ధిదారులకు స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు అందటం ద్వారా బ్యాంకు రుణాలు, నూతనంగా భవనాలు నిర్మించుకునే అవకాశం కలగనుంది.