నల్గొండ

రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 20: జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలోని స్టేఇన్ హోటల్‌లో గురువారం ఉదయం 9గంటల సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మట్టా సైదయ్య చౌదరి(47)ను దుండుగులు గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ముందస్తు పథకం మేరకు దుండగులు భూ వివాదంపై చర్చించుకుందామంటు సైదయ్య చౌదరిని హోటల్ గదికి పిలిపించుకుని కత్తితో గొంతుకోసి హత్య చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. గుంటూరు జిల్లా నుండి దామరచర్లకు వలస వచ్చి మెడికల్ దుకాణం నిర్వహించిన సైదయ్య చౌదరి అనంతరం పదిహేనుళ్లుగా నల్లగొండలోనే ఉంటు రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారం సాగిస్తున్నాడు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న స్టేఇన్ హోటల్‌లో హత్య సంఘటన చోటుచేసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. హత్యా సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి హత్యా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ రంగంలోకి దర్యాప్తు సాగిస్తున్నాయి. పోలీసులు హోటల్‌కు చేరుకునే క్రమంలో నిందితులు వారికి ఎదురుపడినప్పటికి వారే హంతకులని అప్పటికే గుర్తించకపోవడంతో నిందితులు సులువుగా తప్పించుకుపోయారు. డాగ్ స్క్వాడ్ హోటల్ కింది వరకు వచ్చి ఆగగా నిందితులు అక్కడి నుండి వాహనంలో పరారైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. హత్యా సమయంలో సైదయ్య చౌదరి వెంట ఉన్న మరో వ్యక్తి హోటల్ బయటకు వెళ్లి వచ్చినంతలోనే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. సిసి కెమెరాల ఫుటేజి ఆధారంగా సైదయ్య హత్యలో ముగ్గురు నిందితులు పాల్గొన్నారని, నకిరేకల్ మండలంలోని భూవివాదం నేపథ్యంలోనే సైదయ్య చౌదరి హత్య జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సైదయ్య చౌదరితో రియల్ ఎస్టేట్ లావాదేవిలు సాగించిన నకిరేకల్, వల్లాల గ్రామానికి చెందిన వ్యక్తులే సైదయ్య చౌదరిని పథకం ప్రకారం హోటల్‌కు పిలిచి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. టూటౌన్ ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. జిల్లా కేంద్ర మార్చూరీలో సైదయ్య చౌదరి మృతదేహాన్ని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సందర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నారు.