నల్గొండ

డిసెంబర్‌కల్లా ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 20: నల్లగొండ జిల్లా ఎస్ ఎల్‌బిసి ప్రాజెక్టులో అంతర్భాగమైన ఉదయ సముద్రం (బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల) ప్రాజెక్టు పనులను వచ్చే డిసెంబర్‌నాటికి పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం హైద్రాబాద్ జలసౌధలో జరిగిన సమావేశంలో ఉదయ సముద్రం, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకల రిజర్వాయర్ పనుల పురోగతిని సమీక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిన ఈ ప్రాజెక్టును కెసిఆర్ మళ్లీ పట్టాలపైకి ఎక్కించారన్నారు. ఉదయ సముద్రం పనుల పురోగతిపై స్పెషల్ డ్రైవ్ చేస్తేనే డిసెంబర్‌కల్లా ప్రాజెక్టు పనులు పూర్తి జరిగి 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. 60 చెరువులను నింపాల్సి ఉందన్నారు. లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయాలన్నారు. ఎస్‌ఎల్‌బిసి టనె్నల్ పనుల్లో 29 కిలోమీటర్ల పని పూర్తయ్యిందని, మిగతా 14.2 కిలో మీటర్ల పనులు కూడా వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలని కోరారు. పెండ్లిపాకల రిజర్వాయర్ నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న 1,994 ఎకరాల భూసేకరణకు ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఏఎంఆర్‌పిలో లెవల్ కెనాల్ భూసేకరణ కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. కేసులు తేలిపోతే మరో 10 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. ఈ నెల 25న కేసులు కోర్టు ముందుకు రానున్నాయన్నారు. ఎల్‌ఎల్‌సి నుంచి ప్రస్తుతం 37 వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తున్నట్లు, కేసులు పరిష్కారమైతే మొత్తం 50 వేల ఎకరాలకు ఆయకట్టు విస్తరిస్తుందన్నారు. ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేసి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ ఈఎన్‌సి మురళీధర్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సిఈ ఎస్.సునీల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.