మహబూబ్‌నగర్

పునరావాస గ్రామాల్లో సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, జూలై 20: సంగంబండ పునరావాస గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకై తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం సంగంబండ రిజర్వాయర్‌లో భూములు, ఇళ్లు కోల్పోయిన లబ్దిదారులలో ఇంకా 141 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు రాలేదు. వారిలో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో 95 మందికి డిప్పుద్వారా ప్లాట్లను తీసి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. మిగిలిన 46 మందికి కూడా త్వరలో ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పునరావాస గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉండకుండా ప్రభుత్వ ప్లాన్ ఆధారంగా అన్ని సౌఖర్యాలను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. రైతులు తమ విలువైన భూములు కోల్పోయినప్పటికి పది మందికి ఉపయోగపడే విదంగా ప్రాజెక్టులను నిర్మించుకునేందుకై భూములు ఇవ్వడం వారందరు అభినందనీయులని అన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈప్రాంతం పాడిపంటలతో పచ్చదనంతో తులతూగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరాష్ట్ర ప్రజల శ్రేయస్తే ద్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. అందుకు అందరు సహకరించి అభివృద్ధి పథంలో పయనించాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, మండల వైస్ ఎంపిపి సునితాగోపాల్‌రెడ్డి, తహశీల్దార్ ఓంప్రకాష్, డిటి వరప్రసాద్, విఆర్‌ఓలు రాజు తదితరులు పాల్గొన్నారు.