మహబూబ్‌నగర్

కల్తీమసాల తయారీ కేంద్రంపై అధికారుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, జూలై 20: జడ్చర్లపట్టణ ముఖ్య కేంద్రంగా చేసుకొని కల్తీ మసాలాలు తయారు చేస్తున్న జిఎస్ ప్రాడక్ట్స్ తయారీ కేంద్రంపై గురువారం సిఐ గంగధర్,్ఫడ్ ఇన్‌స్పెక్టర్ దర్మేంద్ర లు తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పక్కాసమాచారం లబించడం వల్ల కేంద్రంపై దాడులు చేసిన అధికారులు కేంద్రంలోని కల్తీ సరుకులను చూసి అవాక్కయ్యారు. హైద్రాబాద్‌లోని బేగంబజార్,గుజరాత్‌ల నుండి ముడి సరుకులు కొనుగోలు చేసుకొని వచ్చి ఎలాంటి అనుమతులు లేకుండా మటన్, చికెన్, సబ్జీ తదితర మసాలాలు తయారు చేసి జడ్చర్ల,హైద్రాబాద్ లలో మార్కెటింగ్ చేస్తున్నట్లు అధికారుల తనిఖీలో బయట పడింది నాణ్యమైన మసాలను తయారు చేయడం కోసం 2005 వరకు మాత్రమే అనుమతులు ఉన్నా 2017 వరకు ఎలాంటి అనుమతులు లేకుండా,నాణ్యత లేని మసాలాలను కేంద్రం నిర్వహకుడు సిరాజ్ తయారు చేసి పెద్ద ఎత్తున విక్రయాలు జరిపారు. తనిఖిలలో సమారు ఆరు లక్షల విలువైన కల్తీ మసాలాలు లభ్యమయ్యాయని లభ్యమైన మసాలలను శాంపిల్స్‌ను సేకరించి వాటిని ల్యాబ్‌కు పంపుతున్నట్లు డిఎస్పీ బాస్కర్,్ఫడ్ ఇన్స్‌పెక్టర్ దర్మేంద్రలు వెల్లడించారు. లభ్యమైన ముడి సరుకును,మసాలాలను సీజ్ చేయడంతో పాటుకేంద్రం నిర్వహకుడు సిరాజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డిఎస్పీ బాస్కర్ తెలిపారు. ఈ దాడులలో ఎస్సైలు లక్ష్మినర్సింహులు, మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.