హైదరాబాద్

రోడ్ల మరమ్మతులపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: మహానగరంలో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు అధికారులు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో జిహెచ్‌ఎంసి రోడ్లు, మూసి అభివృద్ధి, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్‌ఎంసిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లంతా రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వచ్చే మూడు నెలల పాటు అధికారులంతా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు కింద నూతనంగా నిర్మించనున్న ఫ్లై ఓవర్లు, స్కైవేల నిర్మాణాల్లో బిటి రోడ్లకు బదులుగా సిమెంటు రోడ్లను నిర్మించాలని ఆదేశించారు. సిమెంటుతో నిర్మిస్తే కనీసం పదేళ్లయిన ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉంటాయన్నారు. ఈ సూచన నేపథ్యంలో ప్రాజెక్టుకు అయ్యే అదనపు వ్యయంపైనే నివేదిక రూపొందించాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. ఆ తర్విత హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రి సమీక్షిస్తూ ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న రోడ్ల తాలుకూ డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసేందుకు ఒక కన్సల్టెన్సీ కాకుండా సాధ్యమైనంత ఎక్కువ కన్సల్టెన్సీలను నియమించి, ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 22న జరిగే ప్రీ బిడ్ సమావేశానికి అనుభవం, మంచి పేరున్న కంపెనీలను మాత్రమే ఆహ్వానించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మూసీ నది పరిరక్షణ, సుందరీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ కన్సల్టెంట్లతో ఆయన చర్చించారు. రాజస్థాన్‌లోని అమానీష నాలా అభివృద్ధి విజయవంతంగా పూర్తయిందని, ఈ ప్రాజెక్టులో ఎదురైన అనుభవాలను ఆధారంగా చేసుకుని మూసీ అభివృద్ధి పనులకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.