హైదరాబాద్

అత్యవసర పనులకు నిబంధనల మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: ఆసుపత్రుల ఆవరణలో కనీసం ప్రతి మూడు నెలలకోసారైనా మొక్కలు నాటితే పచ్చదనం పెరిగి రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం మంత్రి గాంధీ ఆసుపత్రిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు హరితహారం కార్యక్రమాన్న నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ఇళ్ల ఆవరణల్లోనూ, పాఠశాలల్లో, ఆసుపత్రులు, పార్కులు, మైదానాల్లోనూ విస్త్రృతంగా మొక్కలను నాటాలని సూచించారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో వైద్య సేవలకిచ్చే ప్రాధాన్యత పచ్చదనాన్ని పెంపొందించే హరితహారం కార్యక్రమానికి కూడా ఇవ్వాలన్నారు. ఇందుకు అవసరమైన మొక్కలను జిహెచ్‌ఎంసి అందజేస్తుందని, ప్రజలు తమకు కావల్సిన మొక్కలను తీసుకోవచ్చునని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వౌలిక వసతులు, పరికరాలు వంటి సౌకార్యల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని, ఇందులో భాగంగా గాంధీ ఆసుపత్రికి నూతనంగా బెడ్లు, బెడ్‌షీట్లు, అధునాతన పరికరాలు, మార్చురీ వాహనాలు వంటివి సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ విజయరాజ్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రవణ్, ఎమ్మార్వో డా.రాజారావు, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.మంజుల, వైద్య విద్యార్థులు, నర్సింగ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.