రంగారెడ్డి

బంగారు తెలంగాణకు విద్యార్థులు బాటలు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూలై 20: బంగారు తెలంగాణ కోసం విద్యార్థులు బాటలు వేసేందుకు కృషి చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్‌ఎస్‌వి వాల్‌పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం ప్రతిభ బాలికల జూనియర్ కళాశాలలో టిఆర్‌ఎస్‌వి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాల ద్వారా ఎలా సాధించుకున్నామో అదే తరహాలో బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు విద్యార్థిలోకం ఏకం కావాలని పిలుపునిచ్చారు. విద్యారంగ అభివృద్ధికి సిఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిఫ్‌లను విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యాపరంగా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యను వచ్చే ఏడాది నుండి ప్రారంభించేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని వివరించారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌వి కోఆర్డినేటర్లు స్వామి యాదవ్, కె.దిలీప్‌కుమార్, జగన్, పాండు, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్, శ్రీ్ధన్‌రెడ్డి, అన్నారం ప్రతాప్‌రెడ్డి, నాయకులు అశోక్, నవీన్, జాంగారి రవి, శీలం శ్రీకాంత్, శరత్‌కృష్ణ, ఆదిత్యరెడ్డి, రాఘవేందర్, రాజశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ రమేష్‌గౌడ్, రాములు పాల్గొన్నారు.