రంగారెడ్డి

దారిదోపిడీలకు పాల్పడుతున్న నలుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 20: జల్సాలకు అలవాటు పడి దారిదోపిడీలకు పాల్పడుతున్న నలుగురు పాత నేరస్థులను మేడ్చల్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పేట్‌బషీరాబాద్ డివిజన్ ఎసిపి శ్రీనివాస్‌రావు ఇన్‌స్పెక్టర్ ఎస్.వెంకట్‌రెడ్డి మేడ్చల్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మేడ్చల్ మండలంలోని నూతన్‌కల్ గ్రామానికి చెందిన మెండే విజయ్ కుమార్(21), పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన మానేకర్ అంకిత్(20), ఇదే కాలనీకి చెందిన బండి సతీష్ రెడ్డి(22), పట్టణంలోని ఆర్టీసి కాలనీకి చెందిన పల్లాల తుకారామ్(20) జల్సాలకు అలవాటు పడి రాత్రివేళల్లో ఒంటిరిగా వెళ్లే వాహనాదారులను, పాదాచారులను అడ్డగించి వారిని బెదిరించి దారిదోపిడీకి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 11న రాత్రి 9 గంటల ప్రాంతంలో మండలంలోని గౌడవెళ్లి శివారులోని యాదగిరిరెడ్డి వద్ద పశువుల కాపరిగా పనిచేస్తున్న ఫిరంగి సుధాకర్ గదికి వెళ్లి అతన్ని బంధించి అతని వద్ద గల సెల్‌ఫోన్‌ను, ఆరు వందల నగదును దోచుకెళ్లారు. అక్కడి నుండి ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డు మీదుగా గౌడవెళ్లి గ్రామం వైపు బైక్‌పై వస్తున్న ట్యాంకర్ డ్రైవర్ ఆంజనేయులును అడ్డగించి అతని వద్ద సెల్‌ఫోన్‌ను, రూ. 7వేల నగదును దోచుకున్నారు. అనంతరం మేడ్చల్ వైపు నుండి దుందిగల్ వైపునకు బైక్‌పై వెళ్తున్న మునిపల్లి ప్రసాద్‌ను అడ్డగించి రెండు సెల్‌ఫోన్‌లు, రూ.16వేల నగదును దోచుకున్నారు. బాధితుడు ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నేరవిభాగం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా బుధవారం సాయంత్రం పట్టణ శివారులోని లోటస్ ఎన్‌క్లేవ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నిందితులు బైక్‌పై రావడం గమనించి దస్త్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించగా దారిదోపిడీల విషయం వెలుగు చూసింది. విజయ్‌కుమార్, అంకిత్.. పటాన్‌చెరు ప్రాంతంలోని కొల్లూరులోని సమస్తి ఇంటర్నేషనల్ స్కూల్‌లో సెక్యూరిటీ గార్డులు పని చేస్తుండగా సతీష్‌రెడ్డి పని లేకుండా జులాయిగా తిరిగేవాడు.
తుకారామ్.. కొంపల్లి ప్రాంతంలోని సాయితేజ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గతంలో వడియారం రైల్వేస్టేషన్ వద్ద పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసిన బజాజ్ డిస్కవర్ బైక్‌ను, కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లో యమహా ఎఫ్‌జడ్ బైక్‌ను దొంగలించారు. నిందితులు గతంలో పలు కేసులలో అరెస్టై జైలుకు వెళ్లొచ్చారు. నిందితుల నుండి ఐదు సెల్‌ఫోన్‌లు, రెండు బైక్‌లు, రూ.26వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.