పశ్చిమగోదావరి

పోయిరావలెను అమరావతికి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 20: జిల్లాతో అనుబంధం ఉన్నవారు గత పదేళ్ల పశ్చిమ ప్రస్ధానాన్ని పరిశీలించుకుంటే ఆశ్చర్యం, అంతకుమించి ఈ జిల్లాకు ఏమైందన్న అభిప్రాయం కలగకమానదు. ఒకప్పుడు పశ్చిమలో పోస్టింగ్ అంటే లక్షలు పోసైనా దక్కించుకోవచ్చునన్న ప్రచారం జరుగుతుండేది. అలా లక్షలు పోసినవారు ఆతర్వాత ఏం చేస్తారన్నది బహిరంగరహస్యమే. అ అంశాన్ని అలాఉంచితే ముందు ప్రశాంతత, ఆతర్వాత కూల్‌గా ఉద్యోగం చేసుకునే అవకాశం వంటివి అధికారులను, ఉద్యోగులను విశేషంగా ఆకట్టుకునేవని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు పరిస్ధితి చూస్తే మాత్రం ఆసీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు ఇక్కడ పోస్టింగ్‌లు తెచ్చుకుని పనిచేసినవారు ఎదురిచ్చి మరీ మరో జిల్లాలో పోస్టింగ్ కోసం పరుగులు తీస్తున్నారు. ఈవిధంగా జారుకునేందుకు అధికారులు క్యూ కట్టారంటే ఇప్పుడున్న పరిస్ధితిలో ఆశ్చర్యం ఏమికాదు. వివిధ విభాగాల జిల్లా అధికారుల పరిస్దితిని చూస్తే దానిలో సగం మంది ఇప్పుడు మరో జిల్లాకు వెళ్లే సన్నాహంలోనే ఉన్నారని చెప్పవచ్చు. మిగిలినవారు తమ శక్తి మేర ప్రయత్నాలు చేసుకుంటున్నవారే తప్ప ఇప్పుడున్న పోస్టింగ్‌ను కాపాడుకునేందుకు ట్రై చేస్తున్నవారు లేరంటే ఆశ్చర్యం కాదు. కొనే్నళ్ల వ్యవధిలో ఈస్ధాయిలో జిల్లా వ్యవస్ధలో ఇంత మార్పు ఏవిధంగా చోటుచేసుకుందన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఏదీఏమైనా గతంతో పోలిస్తే జిల్లా పరిస్ధితి ఏ ఒక్కటి పోలిక లేదనే చెప్పాలి. ఇదివరకటితో పోలిస్తే ఇక్కడ వెంటాడటం, వేటాడటం వంటివి అధికమయ్యాయన్న అభిప్రాయమే అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. వీటికి మించి విధినిర్వహణ తీరుపై ఉన్నతాధికారులు ఎక్కుపెడుతున్న దుర్భాషల బాణాలు చెవుల్లో సీసం పోసినట్లుగా తయారయ్యాయన్న అవేదనే విన్పిస్తోంది. దానాదీన ఇక్కడ పనిచేస్తున్నవారు ఇక్కడకాకుండా ఇంకెక్కడైనా పోస్టింగ్ ఇచ్చేయడంటూ దానికోసం ఎంతైనా ముట్టచెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారంటే ఇక్కడున్న పరిస్ధితులు ఏవిధంగా ఉన్నాయో అర్ధమవుతుంది. అయితే ఒకరకంగా అధికారయంత్రాంగాన్ని పరుగులు తీయించి పనిచేయించడాన్ని అందరూ ఆహ్వానిస్తారు. దానివల్ల సామాన్య జనానికే మేలు జరిగే అవకాశం ఉంది. అయితే జిల్లాలో మాత్రం ఇదొక విడ్డూరంగా మారిపోయింది. అధికారయంత్రాంగంలో మాత్రం తమను వెంటాడి, వేటాడేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంటే అవిధంగా చేయటం వల్ల సామాన్య జనానికి ఎంతమేరకు మేలు చేకూరిందని పరిశీలిస్తే అక్కడ గతంలో మాదిరిగానే శూన్యంగానే కన్పిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే అటు అధికారులు పనిచేయలేక, ఇటు సామాన్య జనానికి ఆశించిన మేలు జరగక అసలు ఏం జరుగుతోందన్న అనుమానం కలగకమానదు. ఇక అ అంశాలు అలాఉంచితే జిల్లా అధికారుల అంశానికి వస్తే ఇప్పటికే వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టరు సాయిలక్ష్మిశ్వరి జిల్లా నుంచి బదిలీ సాధించుకోగలిగారు. అదే దారిలో మరో నలుగురు జిల్లా అధికారులు కూడా ఉన్నారు. ఈపరిణామాలు చూసి మిగిలిన అధికారులు కూడా అమరావతికి పోయి తమ భవిష్యత్ కాపాడుకోవాలన్న ఆందోళనలో పరుగులు తీస్తున్నారు. వారంతా అక్కడ అమాత్యుల పేషీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పశ్చిమ నుంచి బదిలీ చేసి ఎక్కడకు పంపినా వెళిపోతామంటూ హామీపత్రాలు కూడా ఇచ్చే పరిస్దితికి సిద్ధమయ్యారంటే జిల్లాలో విధినిర్వహణ అంటే వారు ఎంత వణికిపోతున్నారో అర్ధమవుతుంది. అధికశాతం మంది పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే ఆక్రమంలో ఉన్నతాధికారులు వాడుతున్న భాష, కింది ఉద్యోగులు, సిబ్బంది ముందు తమను ఉద్దేశించి వాడుతున్న దుర్భాషలు భరింపశక్యం కాని పరిస్దితికి చేరుకున్నాయని కొంతమంది చెపుతున్నారు. ఇన్ని సంవత్సరాలు సర్వీసు చేసి ఈవయస్సులో ఇన్ని రకాల దుర్భాషలు వినాల్సి రావటం తమ దౌర్భాగ్యం అన్న ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్నారు. కాగా కొంతమంది అధికారులు ఏకంగా శెలవుపెట్టి మరీ బదిలీ ప్రయత్నాల్లో మునిగిపోయారు.
మరోవైపు ఈస్దాయిలో నిబంధనలు, మార్గదర్శకాలంటూ ఉన్నతాధికారులు నీతివాక్యాలు చెపుతుంటే వారి నీడనే, వారి చెంతనే మరికొంతమంది చేస్తున్న ఆరాచకాలకు అడ్డే లేకుండా పోతోందన్న ఆవేదన సంక్షేమశాఖల అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. జనం సంక్షేమం కోసం ఏర్పాటైన ఈ శాఖల్లో ఇప్పుడు అవినీతి సంక్షోభం తారాస్ధాయికి చేరిందన్న ప్రచారం జరుగుతోంది. ఏ చిన్న కాంట్రాక్టు, ఏ చిన్న టెండరు, ఏ చిన్న ఉపాధి అవకాశాలున్నా వాటిని కూడా ఒక అధికారి తనకు అనుకూలంగా మార్చేసుకుని ఫలం ఆయనకు, తిట్ల దండకం తమకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కొన్ని విభాగాల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్ధితులు తాము భరించేది లేదంటూ కొంతమంది తమవంతుగా బదిలీ ప్రయత్నాలు చేసుకుంటూ ఈ కూపం నుంచి బయటపడాలన్న ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నామంటూ తోటి అధికారులతో చెప్పుకోవటం పరిస్దితి తీవ్రతకు అద్దం పడుతుంది.