విశాఖపట్నం

రక్షణ రంగంలో ఎంఒయులు చారిత్రాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూలై 20: ఆంధ్రవిశ్వవిద్యాలయంతో రక్షణ రంగాలు పలు అంశాలపై అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ఎంతో చారిత్రాత్మకమని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. బుధవారం రాత్రి నగరంలోని ఒక హోటల్‌లో ఏయూ డిఫెన్స్ జాయింట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గెట్ టుగెదర్ ఈవెంట్ 2017ను నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏయూతో ఏడు అవగాహన ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్నారు. రక్షణ రంగాలకు ఇప్పటికే 12 ప్రీ రిలీజ్ కోర్సుల నిర్వహణకు అనుమతి లభించిందన్నారు. రెండు వేల మంది రక్షణ రంగాల ఉద్యోగులకు రానున్నకాలంలో వర్సిటీ శిక్షణ ఇవ్వనుందన్నారు. వైస్-అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్ మాట్లాడుతూ రక్షణ రంగాల ఉద్యోగులకు అవసరమైన విద్యార్హతలను పెంచుకునే అవకాశాన్ని ఏయూ అందించిందన్నారు. బోధన, పరిశోధన రంగాల్లో కలసి పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పిఎస్ అవధాని, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డిఇ బాబు, అడ్మిరల్ సూపరింటెండెంట్, నేవల్ డాక్‌యార్డు ఎస్‌ఆర్ శర్మ, అడ్మిరల్ నారాయణప్రసాద్, కమోడోర్ అజయ్ గులి, కమోడోర్ కె.ఎస్ నూర్, డీన్‌లు, అధికారులు, వాయుసేన, నావికాదళ, ఆర్మీ విభాగాల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బిస్త్‌ను ఏయూ వీసీ సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.